ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ(Krishna Vamsi)సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే పక్కా హిట్ అనే టాక్ ముందు వినిపించేది. ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచారు కృష్ణవంశీ. అయితే ఇటీవల కృష్ణవంశీ నుంచి సినిమా తగ్గిపోయాయనే చెప్పాలి. చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా సీతో హిట్ అందుకున్న కృష్ణ వంశీ ఆ తర్వాత నక్షత్రం అనే సినిమా చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా పై ఆసక్తి నెలకొంది. ఆ మధ్య ఈ మూవీలో బ్రహ్మానందం లుక్ ఒకటి బయటకు వచ్చి హల్ చల్ చేసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం విభిన్నమైన పాత్రలో నటించనున్నారని అంటున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ సంగీత దర్శకుడు ఇళయరాజా తో నేపధ్య సంగీతం చేయించుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోస్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇళయరాజాతో వర్క్ ఎక్స్ప్రీరియన్స్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇక త్వరలో ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్న రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటించారు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ తెలుపనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు మెప్పిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.