ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా మరో అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి లీకైన ఫోటోస్, వీడియోస్ మాత్రం సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లో కొడుతుంది. అదెంటంటే.. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ ఉంటుందట. అందులో ఓ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. దుర్మార్గుల పై విలనిజం చేసే హీరోగా చేసే ఫైట్ ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి అప్టేట్స్ మాత్రం రాలేదు.
అయితే ఇప్పటివరకు డీసెంట్ అండ్ లవర్ బాయ్ గా కనిపించిన మహేష్.. తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మాత్రమే కాకుండా.. శ్రీలీల సైతం కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సిననిమాకు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ముందుగా గుంటూరు అని టైటిల్ వినిపించినా.. చివరకు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.