
ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది కాకినాడకు చెందిన శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాల. ఇదే క్రేజ్ తో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడి పెద్దగా పేరు రాలేదు. అయితే కోర్టు సినిమాతో రెండోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. జాబిలిగా తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియన్స్ మన్ననలు అందుకుంది. ఏకంగా డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ సినిమా సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చి 14న విడుదలైన కోర్ట్ సినిమా ఏకంగా రూ. 66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రీదేవికి సోషల్ మీడియాలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇటీవలే కొత్త కారు కూడా కొనేసిందీ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తెగ మురిసిపోయింది. శ్రీదేవి కొన్న కొత్త కారు ధర సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని సమాచారం. ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది శ్రీదేవి. అదేంటంటే.. ఈ కాకినాడ అమ్మాయికి లేటెస్ట్ గా కోలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చింది. తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది శ్రీదేవి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘కేజీఆర్’ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఆయన ఒక సినిమాలో హీరోగా నటిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆయనకు జోడీగానే శ్రీదేవి నటిస్తుంది. కాగా కేజీఆర్‌కు నిర్మాతగా కోలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. గతంలో శివకార్తికేయన్‌తో హీరో, డాక్టర్, అయలాన్ సినిమాలు చేశారాయన. ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడిప్పుడే తెలుగు నాట ఫేమస్ అవుతోన్న ఈ చిన్నది కోలీవుడ్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.
NEW FILM 🔔
– MINI Studios next film starring #KJR 👍
– Recent Telugu super hit film “COURT” heroine #Sridevi plays the female lead.
– Directed by Regan Stanislaus
– Music by Ghibran pic.twitter.com/X3vHXczD4M— Venkatramanan (@VenkatRamanan_) July 7, 2025
Sridevi 🤍#Sridevi pic.twitter.com/pnuvZ9mZL4
— TollywoodPulse (@PulseTollywood) July 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..