
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హవా ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇచ్చిన వారిలో ఈ యంగ్ హీరోయిన్ ఒకరు.. ఆమె ఎవరో కాదు శ్రీదేవి. నేచురల్ నాని ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫొక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ తో పాటు హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
కోర్ట్ సినిమా తర్వాత శ్రీదేవికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి. అలాగే ఈ అమ్మడికి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ కూడా ఈ అమ్మడి లిస్ట్ లో ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నదాని వీడియో నెట్టింట వైరల్ గా అవుతుంది. ఈ వీడియోలో శ్రీదేవిని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే..
తాజాగా రాఖీ సందర్భంగా శ్రీదేవి తన అన్నకు రాఖీ కడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శ్రీదేవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. అయితే ఆమె మేడలో పసుపుతాడు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మెడలో పసుపుతాడుతో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి ఈమెకు పెళ్లయిందా.? మెడలో పసుపుతాడుతో ఉందంటే పెళ్లయినట్టేనా..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా షూటింగ్ లో అయ్యి ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంది అందుకే మెడలో తాడు వేసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి