Sankranthiki Vasthunam: థియేటర్‌లో ‘గోదారి గట్టు మీద’ సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన జంట.. బ్యూటిఫుల్ వీడియో ఇదిగో

|

Jan 16, 2025 | 1:48 PM

'గోదారి గట్టు మీద రామ చిలకవే.. గోరింటా కెట్టుకున్న సంద మామవే'.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. పెళ్లి వేడుకలు పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. సందర్భమేదైనా ప్రస్తుతం ఈ పాట ఉండాల్సిందే. ఇక సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

Sankranthiki Vasthunam: థియేటర్‌లో ‘గోదారి గట్టు మీద’ సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన జంట.. బ్యూటిఫుల్ వీడియో ఇదిగో
Sankranthiki Vasthunam Movie
Follow us on

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ‘గోదారి గట్టు మీద రామచిలుకవే..’ సాంగ్ ఎంత హిట్టయిందో తెలసిందే. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్స్ రీల్స, వీడియోలే దర్శనమిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు. తాజాగా ఓ జంట థియేటర్‌ లోనే గోదారి గట్టు సాంగ్ కు స్టెప్పులేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడుతున్న థియేటర్ లో సాంగ్ ప్లేగానే తమ సీట్ల ముందున్న కొద్ది స్థలంలోనే ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్ చేసినట్టుగా చేస్తూ ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరలవుతోంది.ఈ వీడియోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. ఇన్ స్టా అకౌంట్ వివరాల ప్రకారం.. రూప ఈగో పిల్ల అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. గోదారి గట్టు మీద సాంగ్ ను రమణ గోగులు, మధు ప్రియ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. కాగా చాలా రోజుల తర్వాత ఈ పాట కోసం రమణ గోగుల గొంతు విప్పారు. ఆయన వాయిస్ బేస్ ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచింది.

 

ఇవి కూడా చదవండి

ఇక సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ 77 కోట్లు సాధించింది. వెంకీ మామ కెరీర్ లోనే ఇవి అత్యధిక ఓపెనింగ్స్ కావడం విశేషం.
అలాగే వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార, రఘుబాబు, నరేశ్, ప్రియదర్శి, మురళీ ధర్, పృథ్వీ రాజ్, పోసాని కృష్ణ మురళి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.