Tollywood: అప్పుడు రెండు రూపాయల కూలీ.. ఇప్పుడు హీరోగా 10 ఏళ్లలో 100 సినిమాలు.. ఎవరో తెలుసా.?

1975లో ఒక చిన్న పాత్రతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దక్షిణాది పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు. తన కెరీర్‌లో మొదటి 10 సంవత్సరాలలో 100 సినిమాలు చేశారు. ఎవరో తెలుసా..! ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: అప్పుడు రెండు రూపాయల కూలీ.. ఇప్పుడు హీరోగా 10 ఏళ్లలో 100 సినిమాలు.. ఎవరో తెలుసా.?
Tollywood 1

Updated on: Aug 05, 2025 | 1:19 PM

బెంగళూరులోని మరాఠీ కుటుంబంలో జన్మించిన ఈ నటుడు 25 సంవత్సరాల వయసులో చిన్న పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆపై దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోగా నిలిచారు. అదే సమయంలో హిందీ సినిమాల్లో కూడా పనిచేసి.. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ చెక్కుచెదరని ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సూపర్ స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. ఈ 74 సంవత్సరాల నటుడు మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్.

సూపర్ స్టార్ రజనీకాంత్ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. అభిమానులలో ఆయనకు ఉన్న క్రేజ్.. అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉంటుంది. నేటికీ అదే స్టార్‌డమ్, చెక్కుచెదరని క్రేజ్. దక్షిణాదిలో అభిమానులు ఆయనను దేవుడిలా భావిస్తారు. ఒకప్పుడు రజనీకాంత్‌ను.. ఆయనతో చదివిన క్లాస్‌మేట్ ఒకరు సామాన్లు తీసుకురమ్మని చెప్పారు. ముందుగా అతడు రజనీకాంత్‌ను గుర్తించలేదు. కానీ ఆ తర్వాత ఆయన్ని గుర్తించి ‘నీ అహంకారానికి ఇలా జరగాలి అని ఎగతాళి చేశాడు. కూలీ చేసినందుకు రెండు రూపాయలు’ ఇచ్చాడు. ఈ ఘటన రజనీకాంత్‌ను తీవ్రంగా బాధించింది. మొదటిసారి ఆయన జీవితంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని రజనీకాంత్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. 

నెగటివ్ రోల్‌తో..

మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో ట్రైనింగ్ తీసుకుంటుండగా.. రజనీకాంత్, సినీ దర్శకుడు కె. బాలచంద్రను కలిశారు. ఆయన తన ‘అపూర్వ రాగంగళ్'(1975) చిత్రంలో రజనీకి ఒక చిన్న పాత్ర ఇచ్చారు. అయితే, అది నెగటివ్ రోల్. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా.. శ్రీవిద్య హీరోయిన్‌గా నటించింది.

అమితాబ్ బచ్చన్ ‘డాన్’ రీమేక్..

రజనీకాంత్ కెరీర్ తొలినాళ్లలో పలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆయనకు ‘బిల్లా’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించింది. 1980లో విడుదలైన ఈ చిత్రం, బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 1978లో నటించిన ‘డాన్’ చిత్రానికి తమిళ రీమేక్. బిల్లా భారీ విజయం సాధించి రజనీకాంత్‌ను పరిశ్రమలో సూపర్ స్టార్‌గా నిలబెట్టింది.

అరంగేట్రం తర్వాత 10 సంవత్సరాలలో 100 సినిమాలు..

రజనీకాంత్‌కు కెరీర్ తొలినాళ్లలో ఎప్పుడూ సినిమాలు వరుసపెట్టి చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పది సంవత్సరాలలోపు, 100 చిత్రాలలో నటించారు. ‘శ్రీ రాఘవేంద్ర’ ఆయన 100వ చిత్రం. ఇది 1985లో విడుదలైంది.

ఇది చదవండి: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి