Ilaiyaraja: ఇళయరాజాను అడ్డుకున్న ఆలయ సిబ్బంది.. కారణం ఏంటంటే

ఇళయరాజాను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్ లో అలాగే ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. తమిళనాడులోని ఆండాళ్ ఆండాళ్ ఆలయ గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపం వద్దకు వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించారు.

Ilaiyaraja: ఇళయరాజాను అడ్డుకున్న ఆలయ సిబ్బంది.. కారణం ఏంటంటే
Ilayaraja

Updated on: Dec 16, 2024 | 4:57 PM

సంగీత మ్యాస్ట్రో ఇళయరాజాను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు.. ఇళయరాజాను ఆలయంలోపకి అనుమంతించలేదు. దాంతో గందరగోళం నెలకొంది. తమిళనాడులోని  శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి సంగీత స్వరకర్త ఇళయరాజా ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది ఆయన్ను లోనికి అనుమతించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. సంగీత స్వరకర్త ఇళయరాజా దాదాపు 45 సంవత్సరాలుగా తన సంగీతంతో అభిమానులను కట్టిపడేశారు. ప్రస్తుతం, అతను వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదల2 చిత్రానికి సంగీత దర్శకుడిగా చేస్తున్నారు.. ఈ చిత్రం నుండి గతంలో ఆయన విడుదల చేసిన ‘దినం దియాన్’ పాట ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం 20న థియేటర్లలో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంగీత స్వరకర్త ఇళయరాజా వెళ్లారు. ఆది తిరుపూర్ పంథాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాట్యాంజలి కార్యక్రమం, ఇళయరాజా స్వరపరిచి పాడిన దివ్య పాశురం సంగీత కచేరీ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆండాళ్ ఆలయానికి వచ్చిన ఇళయరాజాకు హిందూ ధర్మాదాయ శాఖ స్వాగతం పలికింది. అనంతరం నందనవనం, ఆండాళ్‌ క్షేత్రం, పెరియ పెరుమాళ్‌ ఆలయాలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. కాగా ఇళయరాజా ఆండాళ్ ఆలయ గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడున్న అర్చకులు, ఆలయ సిబ్బంది ఆయనను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. కారణం ఏంటంటే ఇళయరాజాతో పాటు జీయర్లు కూడా ఆలయానికి విచ్చేశారు. అయితే ఆ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే అనుమతి ఉంది. దాంతో సిబ్బంది ఇళయరాజాను ఆపి వివరంగా చెప్పడంతో.. ఇళయరాజా గర్భగుడి నుంచి బయటకు వెళ్లి అక్కడ పూజలు చేశారు. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయ అర్థ మండపం నుంచి ఇళయరాజా బయటకు వెళ్లడం పై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే చాలా మంది ఇళయరాజాను అభినందిస్తున్నారు. విషయం తెలుసుకొని వినయంగా ఆయన వెనక్కి వచ్చేశారు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.