
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన కమెడియన్ రోలర్ రఘు, సినిమాలతో పాటు జబర్దస్త్ లోనూ తన కామెడీతో నవ్వులు పూయించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సినిమా అంటే తనకెంత ప్రాణమో రఘు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో, తీవ్రమైన రిస్క్ ఫ్యాక్టర్‌తో విజయవాడలో నెల రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నారు. “రోజుకు 15 వేల మంది అడ్మిట్ అవుతున్న హాస్పిటల్‌లో, మాస్కులు వేసుకుని, శానిటైజర్లు పూసుకుని షూటింగ్ చేశా” అని ఆయన అప్పటి భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. దురదృష్టవశాత్తు, ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయినప్పటికీ, తన జర్నీని కొనసాగిస్తూ, “పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ నాకు ఒకటే. డైరెక్టర్ అంటే డైరెక్టరే, ఆ స్పెల్లింగ్ మారదు” అనిఅన్నారు. అనేక చిత్రాలు తాను ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, కొన్ని అసలు విడుదల కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2022 ఆగస్టులో రఘు జీవితంలో ఒక పెను విషాదం చోటుచేసుకుంది. విశ్రాంతి కోసం యూఎస్‌కు వెళ్లి, తిరిగి వచ్చిన వెంటనే అనేక కమిట్‌మెంట్లు ఉన్నప్పటికీ, తన తండ్రి మరణం ఆయన్ని తీవ్రంగా కుదిపేసింది. తన వివాహ వార్షికోత్సవం ఆగస్టు 4వ తేదీనే తండ్రి కన్నుమూయడం ఆయనను మరింత కలచివేసింది. తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసిన మరుసటి రోజే ఒక హిందీ సినిమాకు కమిట్ కావాల్సి వచ్చింది. ఆ సంఘటనతో ఎనిమిది సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనల తర్వాత, సుమారు ఆరు నెలల పాటు రోలర్ రఘు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లారట. వ్యక్తిగత స్థాయిలో కుటుంబ ఒత్తిడి, సినీ అవకాశాలు వదులుకోవడం ఆయన్ని మరింత కృంగదీశాయి. “నేను ఇలా ఎందుకు చేయలేను? ఇలా చేస్తే ఒక్కళ్ళైనా నా ముందు నిలబడగలుగుతారా.?” అని తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆరు నెలల పాటు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డార రఘు.
ఒక రాత్రి “వాట్ ఆమ్ ఐ డూయింగ్?” అని తన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. “నేను నా జీవితం లేదు” అని నిరాశపడకుండా, తెల్లారే లేచి స్నానం చేసి, గుడికి వెళ్లి అరగంట పాటు ప్రశాంతంగా కూర్చుని వచ్చేశారట. అప్పుడే మళ్ళీ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. తిరిగి సినిమా ఆఫీస్‌లకు వెళ్లడం మొదలుపెట్టారట. ఈ సమయంలోనే దర్శకుడు శంకర్ గారి సినిమాకు అవకాశం లభించింది. ఈ అవకాశం తన సినీ జీవితానికి ఒక కొత్త ఆశాకిరణంగా మారిందని రఘు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి