పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. రానా (Rana) దగ్గుపాటి కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak). మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ నటించింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం థియేటర్లలో భీమ్లా నాయక్ హవా కొనసాగుతుంది. పవన్.. రానా నటన.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీని చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు పవన్ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటుడు పృథ్వీ రాజ్ భీమ్లా నాయక్ సినిమా ప్రశంసలు కురిపించారు.
భీమ్లా నాయక్ సినిమాను వీక్షించిన ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు. సినిమా తనకు ఎంతో నచ్చిందని.. పవన్ కళ్యాణ్‌కు దిష్టి తగలకూడని అన్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు నా అభినందనలు. తాజాగా నేను భీమ్లా నాయక్ చిత్రాన్ని చూశాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయా.. అడవి రాముడు సినిమా విడుదలైనప్పుడు మా తాడేపల్లి గూడంలోని విజయటాకీస్కు వెళ్తే బారీగా తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత ఆ క్రేజ్ పవర్ స్టార్ కే చూస్తున్నాను..క్లైమాక్స్, పవర్ స్టార్, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిలా ఈ సినిమాను ఫుల్ ఎంజయ్ చేశాను. ఈ సినిమమా చూస్తున్నంత సేపు ఒక రకమైన బాధలో ఉండిపోయాను. ఇంత అద్భుతమైన సినిమాలో నేను నటించలేదని బాధ పడ్డాను. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుంది. ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నా. అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు.
Chiranjeevi : గ్యాంగ్‌లీడర్ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌తో రానున్న మెగాస్టార్..?
Kodali Nani: బాబును వదిలి అన్నను నమ్ముకో.. పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని సూచన..