AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kallu Chidambaram: సినిమాల కోసం ఆస్తులు అమ్మేశారు.. చనిపోవడానికి కారణం చెప్పిన ఇదే.. కళ్లు చిదంబరం కొడుకు కామెంట్స్..

కళ్లు చిదంబరం అనగానే తెలుగు వారికి సుపరిచితమే. తెలుగులో ఎన్నో సూపర హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన పేరు చెప్పగానే ఎన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. కమెడియన్‌గా కళ్లు చిదంబరం తెలుగు వారందరినీ ఎంతగానో నవ్వించాడు. అమ్మోరు లాంటి సినిమాలో ఎంతో సీరియస్‌గా కనిపించి కొన్ని చోట్ల భయపెట్టించాడు.

Kallu Chidambaram: సినిమాల కోసం ఆస్తులు అమ్మేశారు.. చనిపోవడానికి కారణం చెప్పిన ఇదే.. కళ్లు చిదంబరం కొడుకు కామెంట్స్..
Kallu Chidambaram
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2026 | 6:48 PM

Share

తెలుగు సినిమా రంగంలో తనదైన హాస్యంతో, విలక్షణమైన మెల్లకన్నుతో ప్రేక్షకులను అలరించిన దివంగత నటుడు కళ్ళు చిదంబరం. ఆయన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, కళాకారుల సంక్షేమం పట్ల ఆయనకున్న తపన గురించి ఆయన కుమారుడు కే.ఎస్.ఆర్. రామకృష్ణ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. రామకృష్ణ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ మోస్ట్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఒక అన్నయ్య, అక్క, సోదరి సులక్షణ ఉన్నారు. చిదంబరం బాల్యం నుంచే నాటకాల పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. ఆరో తరగతి నుంచే నాటకాల్లో పాల్గొనేవారు. పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగిగా పనిచేస్తూనే, పదేళ్ల పాటు నాటకాలను ఆర్గనైజ్ చేస్తూ, సరైన సమయానికి ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల 28వ ఏట ఆయనకు మెల్లకన్ను వచ్చిందని రామకృష్ణ తెలిపారు. ఈ సమస్యను సరిదిద్దుకోవడానికి అవకాశమున్నా, ఉద్యోగం, నాటకాల బిజీలో నిర్లక్ష్యం చేశారని చెప్పారు.

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

చిదంబరం సినీ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. గొల్లపూడి మారుతీరావు కళ్ళు నాటకాన్ని విశాఖపట్నంలో ప్రదర్శించినప్పుడు, మొదట నటించడానికి ఆయన ఆసక్తి చూపలేదు. అయితే ఎల్. సత్యానంద్ వంటి మిత్రుల ప్రోత్సాహంతో నటించగా, ఆ నాటకాన్ని చూసిన ఎం.వి. రఘు ఆయన్ను కళ్ళు సినిమాకు పరిచయం చేశారు. కళ్ళు సినిమా పేరు తెచ్చినా, తన మెల్లకన్నును సర్దిద్దుకోవాలనే తపన ఉండేదని, కానీ అదే ఆయన జీవితానికి మంచి పేరు తెచ్చిపెట్టింది కాబట్టి, దానిని అలాగే కొనసాగించాల్సి వచ్చిందని రామకృష్ణ అన్నారు. ఆ తర్వాత ముద్దుల మావయ్య, గోవిందా గోవిందా వంటి చిత్రాలతో మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

అమ్మోరు సినిమా చిదంబరం కెరీర్ లో ఒక మైలురాయి. మొదట చిత్రీకరించిన రీళ్లను ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి కాల్చివేసి, దాదాపు అందరినీ మార్చినప్పటికీ, కోడి రామకృష్ణ పట్టుదలతో చిదంబరం మాత్రమే ఆ సినిమాలో కొనసాగారు. ఈ సినిమా విజయం తర్వాత చిదంబరంని ప్రజలు “అమ్మోరు తల్లి” అని పిలవడం మొదలుపెట్టారని, అది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఇంట్లో చిదంబరం చాలా సీరియస్ వ్యక్తి అని, సినిమా విషయాలు ఇంట్లో చర్చించేవారు కాదని రామకృష్ణ చెప్పారు. చివరి దశలో న్యుమోనియా కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని, చివరి క్షణం వరకు నటించాలని తపన పడినప్పటికీ, లంగ్స్ సమస్యల వల్ల కుదరలేదని వివరించారు.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

Follow Us