AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ్వులు పంచే అలీ జీవితంలో ఇంత విషాదం ఉందా.!! కడుపులోని బిడ్డతో సహా మంటల్లో కాలిపోయింది

బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అలీ. ఆతర్వాత కమెడియన్‌గా, హీరోగా సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

నవ్వులు పంచే అలీ జీవితంలో ఇంత విషాదం ఉందా.!! కడుపులోని బిడ్డతో సహా మంటల్లో కాలిపోయింది
Ali
Rajeev Rayala
|

Updated on: May 21, 2026 | 1:03 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ అలీ పేరు తెలియని వారు ఉండరు. 40 ఏళ్లుగా అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, వందలాది చిత్రాల్లో హాస్యనటుడిగా మనల్ని అలరించారు. నటుడిగా ఆయన ప్రస్థానం సుదీర్ఘమైనది. మంచి మంచి పాత్రలు చేస్తూనే, బుల్లితెరపై యాంకర్‌గా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన నిర్వహించిన “అలీతో సరదాగా” కార్యక్రమం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన అలీ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. గతంలో అలీ తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులకు తాము ఏడుగురు సంతానమని తనకు ఇద్దరు అక్కయ్యలు, ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారని తెలిపారు. తన తండ్రి భరతనాట్యం, కూచిపూడి డ్రెస్సులు కుట్టడంలో నిపుణులని, ఆయన టైలరింగ్ వృత్తి ద్వారానే కుటుంబాన్ని పోషించారని అలీ తెలియజేశారు.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

తాను చిన్నతనంలో తన తండ్రి కుట్టిన బట్టలను ఇస్త్రీ చేసి, ఆ డబ్బులతో సినిమాలు చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. అలీ తన జీవితంలో జరిగిన అత్యంత చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. తన అక్కయ్య ఫాతిమా గర్భవతిగా ఉన్నప్పుడు, స్టవ్ మీద పాలు కాచి దింపుతుండగా, ఆమె చున్నీకి మంటలు అంటుకున్నాయని తెలిపారు. ఆ ప్రమాదంలో అక్కయ్యతో పాటు కడుపులోని బిడ్డ కూడా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని అలీ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తమ కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని, ఆ అక్కయ్య పేరునే తన కూతురికి పెట్టుకున్నానని ఎమోషనల్‌గా తెలియజేశారు.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

అలీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఎన్నో గుప్త దానాలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరైనా సహాయం కోరితే, అలీ గారి దగ్గరికి వెళ్తారని, ఆయన ఎవరికీ కాదు అనకుండా తన తోచిన సహాయం చేస్తారని ఇండస్ట్రీలో అందరూ చెప్తుంటారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా అలీ ఆప్తుడనే చెప్పాలి. ప్రస్తుతం సినిమాలను చాలా వరకు తగ్గించినా, మంచి పాత్ర వస్తే చేయడానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us