Colors Swathi: విడాకులపై కలర్స్ స్వాతి రియాక్షన్.. ఒక్క మాటతో తేల్చేసిన హీరోయిన్..
ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఓ ఆల్బమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మంత్ ఆఫ్ మధు సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి గతంలో త్రిపుర చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి అలరించనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానలిచ్చింది.
తెలుగు సినీ ప్రియులకు కలర్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అష్టా చెమ్మా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. నిఖిల్ సరనస నటించిన కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్వాతి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత స్వాతి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఓ ఆల్బమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మంత్ ఆఫ్ మధు సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి గతంలో త్రిపుర చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి అలరించనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానలిచ్చింది.
అయితే మీడియా సమావేశంలో ఇటీవల మీరు డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా.. వీటిపై మీ సమాధానమేంటీ అని అడగ్గా దీనికి స్వాతి స్పందిస్తూ.. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. చెప్పను అంటూ సూటిగా చెప్పేసింది. అలాగే స్వాతి మాట్లాడుతూ.. కలర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో నాకు కేవలం పదహారేళ్లు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. నన్ను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో కూడా తెలియదు. ఒకవేళ అప్పుడు సోషల్ మీడియా ఉంటే నన్ను ఫుట్ బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
అలాగే ఒక నటిగా తనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయని.. అందుకే విడాకుల గురించి చెప్పను అన్నారు. దీంతో స్వాతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కలర్ స్వాతి వివాహం 2018లో వికాస్ వాసుతో జరిగింది. అయితే కలర్స్ స్వాతి సినిమాల గురించి తప్ప.. తన వ్యక్తిగత విషయాలు గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న స్వాతి .. ఇటీవల పంచతంత్రం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె భర్తతో విడాకులు తీసుకుందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.