Mahesh Babu: న్యూలుక్‌తో సర్ప్రైజ్ చేసిన మహేష్.. మరింత స్టైలీష్ అండ్ మాస్ హీరోగా సూపర్ స్టార్..
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మహేష్ స్టైలీష్ లుక్స్ ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హెయిర్ స్టైల్ తో మరింత హండ్సమ్ గా కనిపిస్తున్నారు మహేష్. తాజాగా మరోసారి న్యూలుక్ తో సర్ ప్రైజ్ చేశాడు సూపర్ స్టార్. ప్రముఖ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ మహేష్ న్యూలుక్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ క్యాప్షన్ ఇస్తూ.. మహేష్ తో మిర్రర్ సెల్పీని పంచుకున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత మహేష్ ఇందులో మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే ఈ సినిమా రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. మంచి సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. లాంగ్ హెయిర్ తోపాటు.. మాస్ హీరో లుక్ మెయింటెన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మహేష్ స్టైలీష్ లుక్స్ ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హెయిర్ స్టైల్ తో మరింత హండ్సమ్ గా కనిపిస్తున్నారు మహేష్. తాజాగా మరోసారి న్యూలుక్ తో సర్ ప్రైజ్ చేశాడు సూపర్ స్టార్. ప్రముఖ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ మహేష్ న్యూలుక్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ క్యాప్షన్ ఇస్తూ.. మహేష్ తో మిర్రర్ సెల్పీని పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుండగా.. మహేష్ కొత్త, డిఫరెంట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘హెయిర్ స్టైల్ అంటే ఇది.. స్వాగ్ అంటే ఇది.. న్యూలుక్ అదిరింది. గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ కొత్త ఫోటోకు ఆయన సతీమణి నమ్రత స్పందిస్తూ.. ఫైర్ ఎమోజీలు పంచుకున్నారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం చిత్రంలో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్..డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వర్క్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. SSMB29 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.