AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy-Prabhas: ‘హాలీవుడ్‌కు పోటీ ఇచ్చాడు’.. ప్రభాస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు జల్లు.. వీడియో

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాహుబలితో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన డార్లింగ్ ఇప్పుడు సలార్, కల్కి సూపర్ హిట్స్ తో క్రేజ్ లో నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం ప్రభాస్ నటన, పాపులారిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు.

CM Revanth Reddy-Prabhas: 'హాలీవుడ్‌కు పోటీ ఇచ్చాడు'.. ప్రభాస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు జల్లు.. వీడియో
CM Revanth Reddy, Prabhas
Basha Shek
|

Updated on: Aug 19, 2024 | 6:42 AM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాహుబలితో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన డార్లింగ్ ఇప్పుడు సలార్, కల్కి సూపర్ హిట్స్ తో క్రేజ్ లో నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం ప్రభాస్ నటన, పాపులారిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్టం రాజు ఒకరు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేం. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇక హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన ‘బాహుబలి’ సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేం’ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.

ఇదే సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తనకు మంచి మిత్రుడంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సలార్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. రీసెంట్ గా కల్కితో మరో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. అలానే మారుతితో కలిసి ది రాజా సాబ్, నాగ్ అశ్విన్ తో కలిసి కల్కి 2, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో.. వీడియో

ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..