Raksha Bandhan 2024: టాలీవుడ్‏లో సిస్టర్ సెంటిమెంట్.. రాఖీ పౌర్ణమి రోజు చూడాల్సిన సినిమాలు ఇవే..

అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల బంధం మరింత బలపడే రోజు రాఖీ పౌర్ణమి. దేశం మొత్తం ఎంతో ప్రేమగా సెలబ్రెట్ చేసుకునే పండగ ఇది. అక్కా చెల్లెళ్లు ఎక్కడున్న ఆగస్టులో వచ్చే ఈ పండగ రోజు తమ తోడబుట్టిన వాళ్లను కలుసుకుని రాఖీ కట్టి రోజంతా తమ కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.

Raksha Bandhan 2024: టాలీవుడ్‏లో సిస్టర్ సెంటిమెంట్.. రాఖీ పౌర్ణమి రోజు చూడాల్సిన సినిమాలు ఇవే..
Raksha Bandan 2024
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2024 | 6:18 AM

అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల బంధం మరింత బలపడే రోజు రాఖీ పౌర్ణమి. దేశం మొత్తం ఎంతో ప్రేమగా సెలబ్రెట్ చేసుకునే పండగ ఇది. అక్కా చెల్లెళ్లు ఎక్కడున్న ఆగస్టులో వచ్చే ఈ పండగ రోజు తమ తోడబుట్టిన వాళ్లను కలుసుకుని రాఖీ కట్టి రోజంతా తమ కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. రాఖీ కట్టిన తమ అక్కలు, చెల్లెళ్లకు తోడబుట్టిన సోదరులు మనసుకు నచ్చిన బహుమతులు ఇస్తుంటారు. ఈరోజు రాఖీ పండగ. రక్త సంబంధం లేకున్నా అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లుగా బంధాలను పంచీ పెంచే పండగ.. కులమతాలకు అతీతంగా చేసుకునే ఫెస్టివల్ ఇది. ఈరోజున కుటుంబమంతా కలిసి హాయిగా ఇంట్లోనే సిస్టర్ సెంటిమెంట్ చిత్రాలు చూస్తూ కుటుంబంతో కలిసి సరదాగా గడపొచ్చు. తెలుగులో అన్నా చెల్లలు, అక్కా తమ్ముడి అనుబంధం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు చాలా స్పెషల్.

తెలుగులో అన్నాచెల్లెలు, అక్కా తమ్ముడి అనుబంధం పై వచ్చిన చిత్రాలు రాఖీ, హిట్లర్, గోరింటాకు, అర్జున్.. ఇలా అనేక సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోస్ అందరూ సిస్టర్ సెంటిమెంట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని అటు యూట్యూబ్.. ఇటు ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నాయి. మరీ ఈ రాఖీ పండగ రోజున చూడాల్సిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.

  • మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా.
  • అర్జున్ సర్జా నటించిన పుట్టింటికి రా చెల్లి.
  • హేష్ బాబు నటించిన అర్జున్
  • జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ.
  • బాలకృష్ణ ముద్దుల మావయ్య.
  • పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం.
  • రాజశేఖర్ నటించిన గోరంటాకు.
  • సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం.
  • వెంకటేశ్ నటించిన గణేశ్.
  • జగపతి బాబు నటించిన శివరామరాజు.
  • కృష్ణ సంప్రదాయ.
  • శోభన్ బాబు నటించిన జీవనరాగం.
  • చెల్లెలి కాపురం
  • అక్కినేని నాగేశ్వరరావు నటించిన బంగారు గాజులు.
  • కృష్ణం రాజు నటించిన సూపర్ హిట్ పల్నాటి పౌరుషం.