Thank You Movie: నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

|

Dec 08, 2021 | 4:10 PM

అక్కినేని యంగ్ హీరో నాచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేశాడు నాగచైతన్య.

Thank You Movie: నాగచైతన్య థాంక్యూ సినిమా పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Thank You
Follow us on

Thank You Movie: అక్కినేని యంగ్ హీరో నాచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేశాడు నాగచైతన్య. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు చైతు. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చైతన్య . అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి సూపర్ హిట్ అందించిన విక్రమ్. ఆతర్వాత అఖిల్ తో కలిసి హలో అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నాగచైతన్యతో కలిసి సినిమా చేస్తున్నాడు విక్రమ్.

ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతన్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని వార్తలు చక్కర్లు  కొడుతున్నాయి. అయితే ఈవార్తలకు చెక్ పెట్టేసింది చిత్రయూనిట్. థాంక్యూ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో చైకి జోడీగా రాశిఖన్నా, అవికా గోర్ నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ ,మహేష్ బాబు అభిమానిగా నాగచైతన్య కనిపించనున్నాడు.ఇక రైట్ టైమ్లో ఈ మూవీ థియేటర్లలో  విడుదలవుతుంది  అని చిత్ర బృందంక్లారిటీ ఇచ్చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్