Ahmedabad Plane Crash: ‘దేవుడా.. మా హృదయం ముక్కలైంది’.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాలీవుడ్ హీరోల దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో దేశమంతా విషాదంలో మునిగిపోయింది. టీవీల్లో, ఫోన్లలో విమాన ప్రమాద దృశ్యాలను చూసి అందరూ తల్లడిల్లిపోతున్నారు. విమానంలోని వారందరూ క్షేమంగా బయటపడాలని దేవుడిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు అహ్మాదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Ahmedabad Plane Crash: దేవుడా.. మా హృదయం ముక్కలైంది.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాలీవుడ్ హీరోల దిగ్భ్రాంతి
Air India Plane Crash

Updated on: Jun 12, 2025 | 5:49 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దేశమంతా తల్లడిల్లుతోంది. విమానంలోని వారంతా సేఫ్ గా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంతాపం తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమాన ప్రమాదం వార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ‘అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాం. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది’ అని ట్వీట్ చేశారు. ఇక ఎన్టీఆర్ ‘అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. బాధితులందరూ ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, క్రూ సభ్యులు.. వారి ఫ్యామిలీలతోనే నా ఆలోచనలు ఉన్నాయి’ అని పోస్ట్ చేశాడు.

అల్లు అర్జున్ స్పందిస్తూ .. ‘ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా హృదయ విదారకం’ అని ట్వీట్ చేశారు. ఇక నటి ఖుష్బూ, “చాలా షాక్ అయ్యాను. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను” అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ట్వీట్..

 

వీరితో పాటు అడివి శేష్, మంచు మనోజ్, శ్రీ విష్ణు, లక్ష్మీ మంచు, నారా రోహిత్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు.అలాగే అక్షయ్ కుమార్, అలియా భట్, జాన్వీ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ విమాన ప్రమాదంపై తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

అల్లు అర్జున్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .