AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Master : మరో కొత్త అవతారంలో శేఖర్ మాస్టర్.. కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు ఇలా..

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా సత్తా చాటుకున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.. ఆయన క్రొయోగ్రాఫీ చేస్తున్నారంటే ఆపాటలో అదిరిపోయే స్టెప్పులుండటం ఖాయం.

Sekhar Master : మరో కొత్త అవతారంలో శేఖర్ మాస్టర్.. కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు ఇలా..
Shekar Mastar
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2021 | 4:03 PM

Share

Sekhar Master : డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా సత్తా చాటుకున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.. ఆయన క్రొయోగ్రాఫీ చేస్తున్నారంటే ఆపాటలో అదిరిపోయే స్టెప్పులుండటం ఖాయం. దాదాపు అందరు హీరోలచేత సూపర్ స్టెప్స్ వేయించారు శేఖర్ మాస్టర్. కోరియోగ్రాఫర్ గానే కాకుండా పలు టీవీ షోల్లో జేడ్జ్ గాను వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించాడు శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు.

గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని అయ్యాయ్యో అయ్యాయ్యో లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: సినిమా టికెట్ ధరలు ఇలా నిర్ణయించండి.. ఏపీ సర్కార్‌కు డిస్టిబ్యూటర్ల ప్రతిపాదన..

Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..