Chiyaan Vikram : షూటింగ్‏లో తీవ్రంగా గాయపడిన హీరో చియాన్ విక్రమ్.. ఆసుపత్రికి తరలింపు..

ఆయన నటిస్తోన్న తంగళన్ రిహార్సల్ సెషన్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం. తీవ్రగాయలైన విక్రమ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విక్రమ్ పక్కటెముక విరిగినట్లుగా సమాచారం.

Chiyaan Vikram : షూటింగ్‏లో తీవ్రంగా గాయపడిన హీరో చియాన్ విక్రమ్.. ఆసుపత్రికి తరలింపు..
Chiyaan Vikram

Updated on: May 03, 2023 | 12:57 PM

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన నటిస్తోన్న తంగళన్ రిహార్సల్ సెషన్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్‌ పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అతడికి ఆపరేషన్‌ చేయాలని తెలిపారు. విక్రమ్ కోలుకోవడానికి  మరింత సమయం పడుతుందని తెలిపారు. డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తంగలన్. ఇందులో మాళవిక మోహన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా కొద్ది రోజులుగా తంగలన్ చిత్రీకరణకు దూరంగా ఉన్నారు విక్రమ్. చెన్నైలో జరుగుతున్న ఈ మూవీ రిహార్సల్ సెషన్ లో గత రెండు మూడు రోజులుగా ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.