ఒకప్పుడు నా దగ్గర టచప్ బాయ్‌గా పనిచేశాడు.. ఇప్పుడు అతడి సినిమాలో నేను నటిస్తున్నా.. నటుడు చిత్రమ్ శ్రీను..
చిత్రమ్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అసలుపేరు శ్రీనివాసులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ హాస్యనటుడు. దర్శకుడు తేజ రూపొందించిన చిత్రం (2000) సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు సుమారు 260కి పైగా సినిమాల్లో నటించారు.

నటుడు చిత్రం శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటుడిగా, ప్రతినాయకుడిగా కనిపించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన శ్రీను ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అతి విశ్వాసం వల్ల కలిగిన నష్టాలను పంచుకున్నారు. బలగం దర్శకుడు వేణు యెల్దండితో తన అనుబంధాన్ని, వేణు ఎదిగిన తీరును వివరించారు. టచ్-అప్ బాయ్‌గా ఉన్న వేణు ఈరోజు పెద్ద దర్శకుడిగా మారడంపై గర్వపడుతూ, ఆయన దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
చిత్రం శ్రీను మాట్లాడుతూ, ఒక దశలో పరిశ్రమ నుండి అవకాశాలు తగ్గిపోయి, తన ఫోన్‌కు అప్పుల వాళ్ల నుండి తప్ప ఎవరి నుండి కాల్స్ వచ్చేవి కావని గుర్తు చేసుకున్నారు. రాజా ది గ్రేట్ చిత్రం విజయం తర్వాతే తన కెరీర్ మళ్లీ గాడిన పడిందని చెప్పారు. తన జీవితంలో ఎదురైన కష్టాలకు ప్రధాన కారణం అతి విశ్వాసమేనని ఆయన అంగీకరించారు. “నేను ఎప్పుడూ బిజీగా ఉంటా. నాకు మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు ఉంది” అనే పొగరుతో డబ్బును విలువైనదిగా భావించలేదని తెలిపారు. రాజీవ్ కనకాలతో కలిసి మణికొండలో భూమి కొనుగోలు గురించి చర్చించినప్పుడు, తాను జూబ్లీహిల్స్‌లో చిరంజీవి పక్కన ఇల్లు కొంటానని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఆలోచన అతి విశ్వాసం వల్లే వచ్చిందని, తర్వాత దాని విలువ తెలుసుకున్నానని వివరించారు. జీవితంలో అప్‌లు, డౌన్‌లు ఉంటాయని గ్రహించి, డబ్బును దాచుకోవడం, పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో నేర్చుకున్నానని శ్రీను స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
బలగం చిత్ర దర్శకుడు వేణు యెల్దండితో తన అనుబంధం గురించి చిత్రం శ్రీను గుర్తు చేసుకున్నారు. వేణు ఒకప్పుడు తన దగ్గర టచ్-అప్ బాయ్‌గా పనిచేశారని, ఆ రోజుల్లోనే వారిద్దరూ అన్నదమ్ముల్లా కలిసిపోయారని చెప్పారు. వేణుకు చేపలు తినే అలవాటు లేకపోవడంతో, అతని కోసం తమ ఇంట్లో మటన్ వండేవారని గుర్తు చేసుకున్నారు. మధురానగర్‌లో ఒక రోజు రాత్రి బయటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేక అక్కడే ఉండాల్సి వచ్చిన వేణు కష్టాలను శ్రీను వివరించారు. అలాంటి కష్టాలు అనుభవించిన వేణు ఈరోజు గొప్ప దర్శకుడిగా ఎదగడం పట్ల చిత్ర శ్రీను ఎంతో గర్వాన్ని వ్యక్తం చేశారు.
వేణు పాటలు పాడుతారని, మంచి సీన్స్ రాస్తారని, 24 గంటలు సినిమా గురించే ఆలోచిస్తారని చెప్పారు. వేణు తనతో పని చేస్తున్నప్పుడు, షాట్ బాగోలేదని ఓపెన్‌గా చెప్పేవాడని, అది తనను మరింత మెరుగుపరచుకోవడానికి సహాయపడిందని గుర్తు చేసుకున్నారు. బలగం తర్వాత వేణుకి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయని, తన టచ్-అప్ బాయ్ ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. ప్రస్తుతం వేణు యెల్దండి దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా రాబోతున్న ఎల్లమ్మ చిత్రంలో తాను ఒక మంచి పాత్రలో నటిస్తున్నట్లు చిత్రం శ్రీను తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
వేణు యేల్దండి ఫోటో..

Venu Yeldandi
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
