Megastar Chiranjeevi: నాన్న అంటే నమ్మకం, స్ఫూర్తి, శక్తి అంటూ రేర్ ఫోటోలను షేర్ చేసిన చిరు కుమార్తె

చిరు సురేఖల మొదటి సంతానం సుష్మిత తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తాను తన తండ్రి చిరంజీవి కలిసి ఉన్న అరుదైన ఫొటోలతో ఒక రీల్ ని పోస్టు చేసింది. 

Megastar Chiranjeevi: నాన్న అంటే నమ్మకం, స్ఫూర్తి, శక్తి అంటూ రేర్ ఫోటోలను షేర్ చేసిన చిరు కుమార్తె
Chiru Sushmita

Updated on: Aug 22, 2022 | 4:04 PM

HBD Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చిరు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా సర్వత్రా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది హీరోల్లో లేని నేచర్.. మెగాస్టార్ చిరంజీవిలో ఉంది .. అందుకే ఆయన 30 దశాబ్దాలకు పైగా అజాత శత్రు. ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే చిరు జీవి చిరంజీవి అందరివాడు. మెగాస్టార్ చిరంజీవి కి పుట్టిన రోజుకి తోటి నటీనటులు, అభిమానులే కాదు.. టీడీపీ, వైసీపీ జనసేన అని లేదు.. అందరివాడు మా చిరు అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు మెగా వారోత్సవాలు పేరుతొ ఎప్పటి నుంచో సామజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరు సురేఖల మొదటి సంతానం సుష్మిత తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తాను తన తండ్రి చిరంజీవి కలిసి ఉన్న అరుదైన ఫొటోలతో ఒక రీల్ ని పోస్టు చేసింది.   చిరంజీవి ఎంతో ప్రేమగా సుస్మితను ఎత్తుకున్న చిన్నప్పటి ఫోటో తో మొదలై.. తాను తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నప్పుడు ఫోటోలు.. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది సుస్మిత..

 

ఇవి కూడా చదవండి

నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు.. నాన్న, మీరు అంతులేని ప్రేమ, నమ్మకం, స్ఫూర్తి అంతకు మించి శక్తి. మీరు మరిన్ని సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఈ వీడియోకి తన శుభాకాంక్షలు, తండ్రిపై తనకు ఉన్న ప్రేమని తెలియజేస్తూ కామెంట్ జతచేసింది సుస్మిత.

 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.