Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా మెగా అభిమానులతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సామాజిక అంశాలకు కమర్షియల్ ఫార్ములాను జోడించి భారీ విజయాలు అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తుండటంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. దానిలో ఒకటి నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో చరణ్ పాల్గొన్నాడు. కాగా ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరూ కలిసి దాదాపు 29 నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో దేవాదాయ భూములను చూపించిన కొరటాల శివ.. టీజర్ లో ఏం చూపించబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమానుంచి టీజర్ కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా అసలు టీజర్ విడుదలైతే అందులో రామ్ చరణ్ ఉంటాడా..? లేదంటే మొత్తం చిరుపైనే టీజర్ ఉంటుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర టీజర్ ఫిబ్రవరిలో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :