
మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ క్రేజీ ఆఫర్ పట్టేశారు. త్వరలో ఆయన మరోసారి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నారు. చిరు-వినాయక్ కాంబినేషన్ లో మూడో సినిమాకు రంగం సిద్దమైంది. గతంలో వీరిద్దరూ ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇవి రెండూ కూడా మంచి విజయాలు అందుకున్నాడు. ఆసక్తికర అంశం ఏంటంటే, ఇవి రెండూ కూడా రీమేక్ చిత్రాలే. తాజాగా చేయబోయే చిత్రం కూడా అదే తరహాలో రూపొందబోతుంది. మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను చూసి..బాగ నచ్చడంతో.. తన తండ్రి కోసం రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారు రామ్‌చరణ్. ఆ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత చివరకు వి.వి.వినాయక్ అప్పగించారు. ప్రజంట్ రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్ తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. వీరు తయారు చేసిన పూర్తిస్థాయి స్క్రిప్టును ఇటీవలే చిరంజీవి విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జనవరిలో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేయాలని ముహూర్తం నిర్ణయించినట్టు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.( Bigg Boss 4 : ఫ్యాషన్ షోల్ చెరో లక్ష గెలుచుకున్న గంగవ్వ, అవినాష్)
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ‘ఆచార్య’ సినిమా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ త్వరలో పున:ప్రారంభం కానుంది. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ లో నటించేందుకు కూడా పచ్చ జెండా ఊపారు చిరు.