సమయం లేదు మిత్రమా.. మరణమా లేక శరణమా అన్నట్టుంది ఇవాళ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. కోవిడ్ ఇస్తున్న చిన్నచిన్న గ్యాప్స్‌నే మహా ప్రసాదంగా భావించి.. పనుల్ని చక్కబెట్టుకోవాల్సిన ఎమర్జెన్సీ సిట్యువేషన్‌ని ఫేస్ చేస్తున్నారు మేకర్స్. అందరూ టాప్‌గేర్‌లో నడుస్తున్నారు.. మరి ఆచార్య ఎక్కడ.. ? అన్నది మెగా అభిమానులకు అంతుబట్టని ప్రశ్నగా మారింది. ట్రిపులార్ మూవీ బ్యాలెన్స్ షూట్‌ని కేవలం 40 రోజుల్లో ఫినిష్ చేసి చెర్రీ, తారక్‌ని వాళ్లవాళ్ల మూవీస్ కోసం రిలీవ్ చెయ్యబోతున్నారు రాజమౌళి. సీత పార్ట్ కోసం వస్తున్న ఆలియా మీద కూడా సాంగ్ షూట్ చేసి.. వెంటనే ముంబై ఫ్లైటెక్కించబోతున్నారు. అటు.. జస్ట్.. నెలరోజుల్లో ప్రభాస్‌ని ఆదిపురుష్ క్యాంప్‌కి అప్పగించేలా షార్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారట రాధేశ్యామ్ డైరెక్టర్. ఇలా యుద్ధ ప్రాతిపదికన సెట్స్ మీదకెళ్తున్నాయి భారీ సినిమాలు. చిన్న సినిమాలు కూడా అదే స్పీడ్ మీదున్నాయి. నిన్నమొన్నే అనౌన్స్ అయినట్టున్న నితిన్ మాస్ట్రో మూవీ… టోటల్ షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసి.. వియ్యార్ రెడీ టు రిలీజ్ అంటోంది. చైతూతో విక్రమ్‌కే కుమార్ డైరెక్ట్ చేస్తున్న థ్యాంక్యూ మూవీ కూడా సైలెంట్‌గా షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేస్తోంది. శ్యామ్ సింగరాయ్ బ్యాలెన్స్ వర్క్‌ని సింగిల్ షెడ్యూల్‌లో ఫినిష్ చెయ్యాలన్నది నేచురల్ స్టార్ నానీ ప్లాన్.
అందరిదీ ఒకదారైతే.. ఆచార్య మూమెంట్స్ మాత్రం అంతుబట్టకుండా వున్నాయట. జూలైలో షూటింగ్ రీస్టార్ట్ చెయ్యాలని కొరటాల క్యాంప్ నుంచి హింట్ వచ్చేసింది. కానీ.. మెగాస్టార్ చిరూ మాత్రం.. రీసెంట్‌గా లూసీఫర్ గెటప్‌లో కనిపించారు. రామ్‌చరణ్ కూడా రామరాజు హెయిర్ స్టయిలిస్ట్‌తో ఫోటో పోస్ట్ చేసి.. అయ్యామ్ విత్ జక్కన్న అంటున్నారు. మరి… ఆచార్య ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిందా..? రిలీజ్ డేట్‌పై కొరటాల మనసులో ఏముంది అనే సందేహాలు మెగాఫ్యాన్స్‌ని వెంటాడుతున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొచ్చేలోగా ఆచార్యను తెర మీద చూసుకోవాలన్నది వాళ్ల యాస్పిరేషన్. అటు… మెగాస్టార్ లైనప్ నుంచి వస్తున్న తాజా అప్‌డేట్స్ ఫ్యాన్స్‌ను మురిపిస్తున్నాయి. బాబీ డైరెక్షన్‌లో చిరూ చెయ్యబోయే మూవీలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. మెగాస్టార్‌ని ఢీకొట్టే విలన్ క్యారక్టర్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖి నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మెగా మూవీకి పాన్ ఇండియా రేంజ్‌లో కాస్టింగ్ సెట్ కావడం అభిమానుల్ని ఊరిస్తోంది. ఆచార్య కంప్లీట్ కాగానే.. బాబీ సినిమానే సెట్స్ మీదికెళ్లబోతోంది అనేది ఫిలిమ్‌నగర్‌లో లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్.