వారెవ్వా.. అందుకే ‘అన్నయ్య’ మెగాస్టార్..అభిమానులు కోసం..

|

Dec 29, 2019 | 2:36 PM

చిరంజీవి…ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఒక సపరేట్ పేజీ ఉంది. కొణిదెల శివ శంకర వర ప్రసాద్..చిరంజీవిగా మారి చిత్ర సీమకు విశేష సేవలందించారు. ఆయనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో, మాస్ స్టెప్పులతో నట ప్రస్థానాన్ని సాగించారు. ఆయనకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉండరు. భక్తులు కూడా ఉంటారు. చిరంజీవి కూడా ఫ్యాన్స్‌ను సొంత సొదరుల్లాగా భావిస్తారు. తన అభిమానుల గొప్పతనాన్ని ఎన్నో వేదికల్లో బహిరంగంగానే చెప్పారు మెగాస్టార్. తాజాగా […]

వారెవ్వా.. అందుకే అన్నయ్య మెగాస్టార్..అభిమానులు కోసం..
Follow us on
చిరంజీవి…ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఒక సపరేట్ పేజీ ఉంది. కొణిదెల శివ శంకర వర ప్రసాద్..చిరంజీవిగా మారి చిత్ర సీమకు విశేష సేవలందించారు. ఆయనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో, మాస్ స్టెప్పులతో నట ప్రస్థానాన్ని సాగించారు. ఆయనకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉండరు. భక్తులు కూడా ఉంటారు. చిరంజీవి కూడా ఫ్యాన్స్‌ను సొంత సొదరుల్లాగా భావిస్తారు. తన అభిమానుల గొప్పతనాన్ని ఎన్నో వేదికల్లో బహిరంగంగానే చెప్పారు మెగాస్టార్.
తాజాగా చిరంజీవి దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఫ్యాన్స్ కోసం ఓ సంచలన కార్యక్రమానికి తెరతీయబోతున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇప్పటికి దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందుకు ఆయన ఫ్యాన్స్ చేస్తోన్న కృషి మరవలేనిది. ఇలా చిరు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా పాలు పంచుకునే వారికి గతంలోనే గుర్తింపు కార్డులను జారీ చేశారు. తాజాగా వారందరికీ మెగాస్టార్ జీవిత బీమా కల్పించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఫ్యాన్స్‌కి అనుకోని ప్రమాదాలు జరిగి మరణించినా, గాయపడ్డా.. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు మెగాస్టార్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారట. దీనిపై చిరు ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ  బీమా కార్యక్రమం నిజంగా ప్రారంభిస్తే అభిమానులు భద్రత కోరుకునే రియల్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.