‘మన శంకర వరప్రసాద్ గారి’ ఇంటి గురించి తెలుసా? ఇంద్ర భవనమే.. హోమ్ టూర్ వీడియో ఇదిగో

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా మొత్తం దాదాపు ఒక ఇంట్లోనే జరుగుతుంది. ఇప్పుడీ ఇంటి గురించి కొన్నిఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే దీనికి సంబంధించి ఒక హోమ్ టూర్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

మన శంకర వరప్రసాద్ గారి ఇంటి గురించి తెలుసా? ఇంద్ర భవనమే.. హోమ్ టూర్ వీడియో ఇదిగో
Mana Shankara Vara Prasad Garu Movie

Updated on: Jan 20, 2026 | 9:55 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటికే ఈ మెగా మూవీకి రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. సాధారణంగా ఏదైనా సినిమా చేయాలంటే స్టోరీకి అనుగుణంగా సెట్స్ వేస్తుంటారు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ దాదాపు ఒక ఇంట్లోనే జరుగుతుంది. ఇందుకోసం ఒక అద్భుతమైన ఇంటిని సెట్ గా వేసినట్టు తెలుస్తోంది. ఈ సెట్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు సమాచారం. అయితే ఈ ఇంటి సెట్ కోసం ఉపయోగించిన వస్తువులన్నీ కూడా నిజమైన వస్తువులేనట.
ఈ నేపథ్యంలో మన శంకరవరప్రసాదగ్ గారు ఇంటికి సంబంధించిన ఒక హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ హౌస్ లోనే జరిగిందట. అందుకే రియల్ ప్రాపర్టీస్ ఉపయోగించి ఈ హౌస్ ఏర్పాటు చేశారట మేకర్స్. వెంకటేష్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు మీసాల పిల్ల అనే పాటను కూడా ఇక్కడే చిత్రీకరించారని సమాచారం. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.

‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇల్లు ఇదే.. హోమ్ టూర్ వీడియో

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..