Chiranjeevi: డౌటే లేదు.! డ్యాన్స్‌లో మెగాస్టారే తోపు.. స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

| Edited By: Ravi Kiran

Jul 14, 2023 | 7:30 AM

చిరంజీవి అంటేనే డాన్స్.. ఆయన డాన్స్ లేని సినిమా అంటే ఉప్పు లేని పప్పు లాంటిదే. అయితే ఆయన కూడా మనిషే కదా.. మిషన్ కాదుగా. 68 ఏళ్ళ వయసులో డాన్సులంటే కష్టమే.

Chiranjeevi: డౌటే లేదు.! డ్యాన్స్‌లో మెగాస్టారే తోపు.. స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Bhola Shankar
Follow us on

చిరంజీవి అంటేనే డాన్స్.. ఆయన డాన్స్ లేని సినిమా అంటే ఉప్పు లేని పప్పు లాంటిదే. అయితే ఆయన కూడా మనిషే కదా.. మిషన్ కాదుగా. 68 ఏళ్ళ వయసులో డాన్సులంటే కష్టమే. అందుకే డాన్స్ లేదనకుండా.. ఫ్యాన్స్ ఫీల్ అవ్వకుండా ఓ స్పెషల్ ప్లాన్ సిద్ధం చేసారు. ఖైదీ నెం 150 నుంచి అదే అప్లై చేస్తున్నారు మెగాస్టార్. అది బాగానే వర్కవుట్ అవుతుంది కూడా. ఇంతకీ ఏంటా మెగా డాన్సింగ్ ప్లాన్..?

చిరంజీవి సినిమా ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వస్తే నూటికి 90 మంది చెప్పేది ఆయన డాన్సులే కోసమే అంటారు. ఫైట్లు, కామెడీ ఇలా అన్నింట్లో ఆయన టాప్ అయినా.. డాన్సుల్లో మాత్రం కింగ్. పాటలొస్తే కాసేపే బ్రేక్ వచ్చిందని ఫీలయ్యే ప్రేక్షకులను.. కేవలం పాటల కోసమే థియేటర్స్‌కు రప్పించేలా చేసింది చిరు డాన్స్. టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే బెస్ట్ డాన్సర్స్‌లో చిరంజీవి ఒకరు.

ఒకప్పుడు అంటే ఓకే కానీ.. ఇప్పుడాయన వయసు 68 ఏళ్లు. ఈ ఏజ్‌లోనూ మునపటిలా డాన్సులంటే కష్టం. అందుకే రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఓ ప్లాన్ అప్లై చేస్తున్నారు మెగాస్టార్. తన ప్రతీ పాటలోనూ ఓ హుక్ స్టెప్ పెట్టుకుంటున్నారు. సింపుల్‌గానే ఉన్నా.. ఆడియన్స్‌‌కు రిజిష్టర్ అయ్యేలా ఆ స్టెప్ కొరియోగ్రఫర్స్ ప్లాన్ చేస్తున్నారు. అమ్ముడు కుమ్ముడు అయినా.. బాస్ పార్టీ అయినా.. ఆ ఒక్క హుక్ స్టెప్ హైలైట్ అవుతుంది.

ఆరేళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు అంతా హుక్ స్టెప్‌కు పడిపోతున్నారు. చిరు వయసును దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫర్స్ కూడా సింపుల్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ఈ మధ్య మెగాస్టార్‌కు బాగా కనెక్ట్ అయిపోయారు. అమ్మడు కుమ్ముడు, బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ అన్నీ ఆయనే చేసారు. అన్నింట్లోనూ సింపుల్ స్టెప్స్ బాగా హైలైట్ అయ్యాయి.

తాజాగా భోళా శంకర్‌లోనూ ఒక హుక్ స్టెప్ పెట్టారు శేఖర్ మాస్టర్. భోళా మేనియాలో చేతిలో కీ చైన్ పట్టుకుని ఉన్నచోటే మెలికలు తిరాగారు మెగాస్టార్. తాజాగా విడుదలైన పార్టీ సాంగ్‌లోనూ వేసే రెండు స్టెప్పుల్నే చాలా పర్ఫెక్టుగా చేసారు చిరంజీవి. మొదట్నుంచీ హుక్ స్టెప్స్‌ చేస్తున్నా.. ఈ మధ్య ఆ స్టెప్పుల మీదే పాటలు వెళ్లిపోతున్నాయి. మొత్తానికి చిరు ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని వాటితోనే సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.