Chiranjeevi: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. క్లింకారను చూశారా? ఎంత క్యూట్ గా ఉందో!

|

Jan 14, 2025 | 4:19 PM

సంక్రాంతి సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Chiranjeevi: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. క్లింకారను చూశారా? ఎంత క్యూట్ గా ఉందో!
Mega Family
Follow us on

 

సినిమా ఇండస్ట్రీలో పండగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీనే. ఏ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసే సెలబ్రేట్ చేసుకుంటారు. హీరోలు, వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడుపుతారు. గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల ఫొటోలు బాగా వైరలయ్యాయి. అయితే ఈసారి మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపించడం లేదు. కాగా సంక్రాంతి సందర్భంగ మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మెగా కోడలు ఉపాసన ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసింది. ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వీరి కూతురు క్లిన్ కారా ఉన్నారు. అలాగే నిన్న ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియోను అందులో షేర్ చేసింది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన. ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

 

అయితే ఈ ఫొటోలు, వీడియోల్లో కూడా క్లిం కార ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్- ఉపాసన. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ స్పందించాడు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తను నాన్న అని పిలిచినా తర్వాత తన కూతురి ఫేస్ చూపిస్తాను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

సంక్రాంతి సంబరాల్లో ఉపాసన, రామ్ చరణ్..

కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే రూ. 186 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది.

చిరంజీవి ట్వీట్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.