Ali Daughter Marriage: వేడుకగా అలీ కూతురు వివాహం.. సందడి చేసిన మెగాస్టార్‌, నాగ్ దంపతులు

మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, అమల దంపతులు, మంత్రి రోజా తదితరులు ఈ పెళ్లివేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Ali Daughter Marriage: వేడుకగా అలీ కూతురు వివాహం.. సందడి చేసిన మెగాస్టార్‌, నాగ్ దంపతులు
Ali Daughter Marriage

Updated on: Nov 28, 2022 | 7:12 AM

ప్రముఖ నటుడు, కమెడియన్‌ అలీ కూతురు ఫాతిమా పెళ్లిపీటలెక్కింది. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆమె వివాహం ఘనంగా జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, అమల దంపతులు, మంత్రి రోజా తదితరులు ఈ పెళ్లివేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఫాతిమా పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సినీ తారలు, అభిమానులు, నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా తమ కూతురు పెళ్లికి రావాలని అలీ, జుబేదా దంపతులు ఏపీ సీఎం జగన్‌తో పాటు గవర్నర్‌ తమిళిసై మెగాస్టార్‌ చిరంజీవి, రేవంత్‌ రెడ్డి తదితర సెలబ్రిటీల ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత కూతురు జ్యువెలరీ షాపింగ్ నుండి హల్దీ వేడుకల వరకు, వెడ్డింగ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అభిమానులకు తెలియజేస్తోంది.

Ali Daughter Marriage

1979లో నిండు నూరేళ్లు చిత్రంతో వెండితెరకు పరిచయమైన అలీ తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపు 1000 చిత్రాలకు పైగా నటించారు. తన నటనతో నవ్వుల పూవులు పూయిస్తోన్న ఆయన రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియామితులయ్యారు. అలీ, జుబేదా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఫాతిమా రెమీజు మెడిసిన్ చదువుతోంది.ఇక అలీకి కాబోయే అల్లుడు కూడా డాక్టరే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..