AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో ఆ సీన్స్ పీక్స్‌లో ఉంటాయట.. ఫ్యాన్స్‌కు పూనకాలే

గాడ్ ఫాదర్ హిట్ సరిపోకపోడంతో ఇప్పుడు ఫ్యాన్ ఆశలన్నీ వాల్తేరు వీరయ్య సినిమా పైనే పెట్టుకున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు.

Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో ఆ సీన్స్ పీక్స్‌లో ఉంటాయట.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Megastar Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2022 | 6:56 AM

Share

మెగా స్టార్ చిరంజీవి రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది. గాడ్ ఫాదర్ హిట్ సరిపోకపోడంతో ఇప్పుడు ఫ్యాన్ ఆశలన్నీ వాల్తేరు వీరయ్య సినిమా పైనే పెట్టుకున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే రీసెంట్ గా వచ్చిన బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది.

ఇప్పటికే మిలియన్ కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో  చిరంజీవి , రవితేజ కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సవతి తల్లి కొడుకుగా రవితేజ నటిస్తున్నాడని.. ఇద్దరికీ మధ్య పడదు అని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ అన్న తమ్ముళ్ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండనున్నాయట. ఇద్దరి మధ్య పోటీ ఎత్తుకు పై ఎత్తులు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని అంటున్నారు. అలాగే ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. ఇక త్వరలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఎలా ఉండబోతున్నాడు క్లారిటీ ఇవ్వబోతున్నారు. అలాగే ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేసిన సాంగ్ ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి
Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..