Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అనుకున్నదానికంటే ముందుగానే రానున్న వాల్తేరు వీరయ్య..

|

Nov 03, 2022 | 5:57 PM

గాడ్ ఫాదర్ సినిమా మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా నటించారు.

Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అనుకున్నదానికంటే ముందుగానే రానున్న వాల్తేరు వీరయ్య..
Waltair Veerayya
Follow us on

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు అప్ కమింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా నటించారు. ఇక ఇప్పుడు చిరు మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా చేస్తున్నారు అలాగే బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు ఓ వీడియో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతికి భారీ పోటీ ఉంది. సంక్రాంతికి బరిలోకి దిగడానికి అటు నందమూరి నటసింహం కూడా రెడీ అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 లేదా 12న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ మూవీ కూడా అదే సమయానికి రానుంది.

అయితే ఇప్పుడు మెగాస్టార్ మూవీ విడుదల తేదీని మార్చనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలకు ఒకరే నిర్మాత కాబట్టి థియేటర్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో చిరంజీవి సినిమాను 5,6 తేదీల్లో రిలీజ్ చేయాలని ‘మైత్రి’ సంస్థ భావిస్తోందట.. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి