AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఒకేసారి 20 సినిమాలకు సైన్.. నిర్మాత అడిగిన ఒక్క ప్రశ్నతో కోట్లు వెనక్కి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ ఆమె..

ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్లు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు సీనియర్ తారలు సైతం ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఓటీటీ క్వీన్స్ గా మారుతున్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నటి ఒకరు.

Actress : ఒకేసారి 20 సినిమాలకు సైన్.. నిర్మాత అడిగిన ఒక్క ప్రశ్నతో కోట్లు వెనక్కి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ ఆమె..
Divya Dutta
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2026 | 2:32 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, రొమాంటిక్, క్రైమ్ ఇలా డిఫరెంట్ జానర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఓ సిరీస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే చిరాయా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. వైవాహిక ఆత్యాచారం అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం దూసుకుపోతుంది. అలాగే ఈ సిరీస్ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది దివ్య దత్తా.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

చిరాయా వెబ్ సిరీస్ లో దివ్య దత్తా ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఒకప్పుడు ఆమె దాదాపు 20 సినిమాలకు ఒకేసారి సైన్ చేసింది. కానీ ఒక నిర్మాత అడిగిన ప్రశ్నకు కోట్ల రూపాయాలు వెనక్కి ఇచ్చేసిందట. 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమైన ఆమె.. 1999లో వచ్చిన పంజాబీలో వచ్చిన షహీద్ ఎ మొహబ్బత్ బూటా సింగ్ అనే మూవీతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వీర్ జారా అనే మూవీ ఆమె సినీ ప్రయాణానికి బ్రేక్ ఇచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఈ సినిమా తర్వాత దివ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒక్కసారిగా ఆమె 20 సినిమాలకు సైన్ చేసింది. అయితే ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా వేసిన ప్రశ్నకు తన కెరీర్ మలుపు తిప్పిందని తెలిపింది. తాను 20 సినిమాలకు సంతకం చేశానని ఆదిత్య చోప్రాతో గర్వంగా చెప్పానని.. కానీ ఆయనలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ కనిపించలేదని తెలిపింది. కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తావా.. లేకపోతే లెగసీ వదిలేస్తావా అని తనను అడిగారని.. ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. ? అని ఆదిత్య తనను అడిగారని.. తాను లేదని చెప్పడంతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారని చెప్పుకొచ్చింది. డబ్బు కోసం కాకుండా గొప్ప పేరు కోసం సినిమాలు చేయాలని సూచించారని.. దీంతో వెంటనే సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశానని తెలిపింది. ప్రస్తుతం దివ్య దత్తా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Meena: ఏంటీ మేడమ్ మీరు.. మీనా ఎంతవరకు చదువుకుందో తెలుసా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!