Childhood Photo: ఈ ఫొటోలోని చిన్నారి బాలుడు అచ్చ తెలుగబ్బాయి.. కోలీవుడ్ లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..

సెలబ్రెటీ హీరోకి సంబంధించిన చిన్నతనంలోని ఫోటోనీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం.. ఆ చిన్నారి అచ్చ తెలుగు అబ్బాయి.. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో.. అంతేకాదు ఫేమస్ రేసర్ కూడా.. ఎవరో గుర్తు పట్టారా.. 

Childhood Photo: ఈ ఫొటోలోని చిన్నారి బాలుడు అచ్చ తెలుగబ్బాయి.. కోలీవుడ్ లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..
Childhood Photo Viral

Updated on: Sep 13, 2022 | 8:24 PM

Childhood Photo: జీవితంలో బాల్యం అత్యంత మధురం.. ప్రతి మనిషి జీవితంలో జ్ఞాపకాలాలు పదిలం.. ఎంత విలువైనవి. మనుషులు ఎంత పెద్దవారైనా.. సమాజంలో ఏ స్టేజ్ లో ఉన్నా సరే… ప్రతి రోజూ ఒక్కసారైనా తమ జీవితంలో బాల్యాన్ని తలచుకుని సంతోషపడతారు. సామాన్యులే కాదు, సెలబ్రటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరూ ఏదొక సందర్భంలో తమ బాల్యాన్ని తలచుకుంటూనే ఉంటారు. తాజాగా ఓ సెలబ్రెటీ హీరోకి సంబంధించిన చిన్నతనంలోని ఫోటోనీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం.. ఆ చిన్నారి అచ్చ తెలుగు అబ్బాయి.. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో.. అంతేకాదు ఫేమస్ రేసర్ కూడా.. ఎవరో గుర్తు పట్టారా..

అవును అతనే అజిత్ కుమార్.. ఫ్యాన్స్ ముద్దుగా తలా అని పిలుచుకునే అజిత్ కుమార్.. ఫేమస్ సౌత్ ఇండియన్ స్టార్ హీరో. సికింద్రాబాద్ లో జన్మించిన అజిత్ కుమార్.. మంచి రేసర్.. స్టార్ హీరో. మోడలింగ్ నుంచి టాలీవుడ్ లో శ్రీకర్ గా ప్రేమ పుస్తకం సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. తమిళ సినిమాల్లో అజిత్ గా ప్రేమలేఖ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడుగా ఆకట్టుకున్నాడు.

చదివింది 10 వ తరగతి మాత్రమే అయినా మంచి తెలివైన వ్యక్తి.. బహుభాషా కోవిదుడు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలతో పాటు ఇంగ్లిష్ కూడా అనర్గళంగా మాట్లాడతాడు. బైక్ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించిన అజిత్ .. రేగింగుల్లో పాల్గొనేవాడు. దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడుగా అజిత్ కుమార్ ఫేమస్..

ఇవి కూడా చదవండి

హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సహజత్వాన్నీ ఇష్టపడే ఈ హీరో జుట్టు తెల్లబడినా రంగు వేసుకోకుండా హీరోగా సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us