
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. టాప్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సూపర్ హిట్ సినిమాలను అందిస్తూనే.. మరోవైపు అదిరిపోయే వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తుంది. వీటితో పాటు ఆకట్టుకునే టాక్ షోలు, అలాగే గేమ్ షోలు ప్రేక్షకులకు అందిస్తుంది. వీటితోపాటు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీ లో సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్న “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” కొత్త సీజన్ మొదలు కానుంది. సీజన్ 5 నవంబర్ 20నుంచి రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. చెఫ్ మంత్ర సీజన్ 1,2,3,4 టేస్టీ ఎంటర్ టైన్ మెంట్ ను ఈ సీజన్ 5 మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ కె అంటే ఏంటి అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కెలో తనవంతు వినోదాన్ని జోడించనున్నారు. అమర్ దీప్, అఖిల్, దీపికా రంగరాజు, సుప్రిత, యాదమ్మ రాజు, పండుతోపాటు మరికొంతమంది సీరియల్ నటీమణులు రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తెలుగింటి వంటలతో పాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్5 అందించనుంది.
తాజాగా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్5 నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఒకే ఏడాది రెండు సీజన్స్ మొదలు పెట్టిన ఏకైక షో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె అంటూ సుమ మరోసారి తన ఎనర్జీ తో ఆకట్టుకున్నారు. అలాగే అందాల సీరియల్ బ్యూటీలు కూడా ఈ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఆసక్తికర షోను అస్సలు మిస్ అవ్వకండి. నవంబర్ 20న ఈ షోను ఆహాలో వీక్షించండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి