Dussehra Movies: పండగ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఈ దసరాకు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

|

Oct 07, 2024 | 2:59 PM

ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలనం సృష్టిస్తుండగా.. మరికొన్ని చిత్రాలు తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతోపాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ దసరాకు థియేటర్లలో ఏఏ చిత్రాలు విడదలకాబోతున్నాయో తెలుసుకుందామా.

Dussehra Movies: పండగ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఈ దసరాకు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Telugu Movies
Follow us on

దసరా పండగ సందడి మొదలైంది. ఈ దేవి శరన్నవరాత్రులలో.. ఓవైపు బతుకమ్మ.. మరోవైపు దాండియా ఆటలతో సరదగా గడిపేస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే వెండితెరపై కూడా పండగ సందడి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలనం సృష్టిస్తుండగా.. మరికొన్ని చిత్రాలు తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతోపాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ దసరాకు థియేటర్లలో ఏఏ చిత్రాలు విడదలకాబోతున్నాయో తెలుసుకుందామా.

వేట్టయాన్…

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో జైభీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన సినిమా వేట్టయాన్. మంజు వారియర్, అమితాబ్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా దసరా కానుకుగా అక్టోబర్ 10న విడుదల కానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

విశ్వం..

గోపిచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న సినిమా విశ్వం. ఇందులో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 11న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.

మార్టిన్..

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ హీరో ధృవ సర్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఎ.పి.అర్జున్ రూపొందించిన పాన్ ఇండియా మూవీ మార్టిన్. వైభవి శాండిల్య కథానాయికగా నటిస్తుండగా.. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కన్నడతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

జిగ్రా..

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన సినిమా జిగ్రా. డైరెక్టర్ వాసన్ బాలా తెరకెక్కించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, ఎటర్నల్ షైన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించగా.. అక్టోబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

మా నాన్న సూపర్ హీరో..

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన సినిమా మా నాన్న హీరో. ఆర్ణ కథానాయికగా నటిస్తుండగా.. షాయాజీ షిండే కీలకపాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

జనక అయితే గనక..

ఈ దసరాకు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు సుహాస్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందీప్ బండ్ల తెరకెక్కిస్తున్న సినిమా జనక అయితే గనక. సంకీర్తన హీరోయిన్ గా నటిస్తున్న ఈ కామెడీ డ్రామాను అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.