AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వడ్డే నవీన్ భార్య టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా?

నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగులో చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన వారసుడిగా తెరంగ్రేటం చేసిన నవీన్.. ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఆ తర్వాత స్లో.. స్లోగా ఆయన గ్రాఫ్ పడిపోయింది.

Tollywood: వడ్డే నవీన్ భార్య టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా?
Vadde Naveen
Ram Naramaneni
|

Updated on: Oct 07, 2024 | 2:51 PM

Share

టాలీవుడ్‌లో హీరోయిన్స్ ఫేడవుట్ అవుతుంటారు కానీ.. హీరోలు ఫేడ్ ఔట్ అవ్వడం అనేది ఉండదు. ఒకవేళ ఏజ్ పెరిగి హీరో వేషాలు రాకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయినా మారిపోతారు. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్, జగపతిబాబు, సుమన్, వేణు ఆ కోవకు చెందినవారే. అయితే 90లలో స్టార్ హీరోగా రాణించి.. వరుస హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు. టాలీవుడ్‌లో పేరున్న నిర్మాత వడ్డే రమేష్ తనయుడు నవీన్. 1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు చిత్రంతో అతను విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు ఓ రేంజ్‌ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో వడ్డే నవీన్ డేట్స్ కోసం మేకర్స్ క్యూ కట్టారు.

ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, లవ్ స్టోరీ 1999, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా,  మా ఆవిడమీదొట్టు – మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి చిత్రాలకు ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యారు. 2010 తర్వాత.. ఆయన సినిమాలకు దూరమయ్యారు. 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో ఇలా మెరిసి.. అలా మాయమయ్యారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీవైపే చూడటం లేదు.

అయితే వడ్డే నవీన్ గురించి చాలామందికి తెలియన విషయం ఒకటుంది. ఆయన టాలీవుడ్‌లో ఓ అగ్ర కుటుంబానికి చెందిన మహిళను పెళ్లాడారు. అవును.. నందమూరి ఫ్యామిలీకి చెందిన మహిళతో ఏడడుగులు వేశారు. వడ్డే నవీన్ మొదటి భార్య.. నందమూరి ఇంటి ఆడపడుచు. వడ్డే, నందమూరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్‌కి ఇచ్చి వివాహం చేశారు పెద్దలు. ఆమె నందమూరి బాలకృష్ణకు కూతురు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు సోదరి వరస అవుతుంది. అయితే అభిప్రాయ బేధాలతో కొన్నాళ్లకు ఈ జంట విడిపోయారు.

నవీన్ కెరీర్‌లో ‘పెళ్లి’ సినిమా మాత్రం ఎవర్‌గ్రీన్ క్లాసిక్. ఈ సినిమాలో మహేశ్వరి హరోయిన్‌గా నటించగా.. పృథ్వి కీలక పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత టాప్ హీరోగా రాణించిన వడ్డే నవీన్.. అపజయాలతో ఇండస్ట్రీకి దూరం జరిగారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.