Chatrapathi Movie: ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. ‘ఛత్రపతి’ మళ్లీ వస్తున్నాడు.. రీరిలీజ్ ఎప్పుడంటే..

కానీ ఆ తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, కల్కీ చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. డార్లింగ్ కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఛత్రపతి మరోసారి థియేటర్లలోకి రాబోతుంది.

Chatrapathi Movie: ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. ఛత్రపతి మళ్లీ వస్తున్నాడు.. రీరిలీజ్ ఎప్పుడంటే..
Chatrapathi Movie

Updated on: Oct 18, 2023 | 9:58 PM

ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ మూవీస్ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా డార్లింగ్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులే ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, కల్కీ చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. డార్లింగ్ కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఛత్రపతి మరోసారి థియేటర్లలోకి రాబోతుంది.

ప్రభాస్, శ్రియా జంటగా నటించిన ఛత్రపతి సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పూర్తిగా మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో భానుప్రియ కీలకపాత్ర పోషించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిని 4కే వెర్షన్ లో అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ అన్నింటిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో కోట శ్రీనివాస్ రావు, ప్రదీప్ రావత్, జై ప్రకాష్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. సలార్ కంటే ముందే మరోసారి డార్లింగ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.