బాలీవుడ్‌లో సౌత్ డామినేషన్ నడుస్తున్న నేపథ్యంలోనే మన హీరోలంతా నార్త్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే అంతా పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తుంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం నేరుగా ముంబై ట్రైన్ ఎక్కారు. ఛత్రపతి రీమేక్‌తో ఈయన నార్త్ ఆడియన్స్‌కు హాయ్ చెప్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అల్లుడుశ్రీనుతో టాలీవుడ్‌కు బెల్లంకొండను పరిచయం చేసిన వివి వినాయక్.. హిందీలోనూ ఆ బాధ్యత తీసుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే మక్కీ కి మక్కీ తెలుగు సినిమాను దించేసినట్లు తెలుస్తుంది. ఎక్కడా రిస్క్ తీసుకోకుండా రాజమౌళిని ఫాలో అయిపోయారు వినాయక్. ఇక్కడ శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో సాగితే.. హిందీలో పాకిస్థాన్ నేపథ్యం తీసుకున్నారు.
యూ ట్యూబ్‌లో బెల్లంకొండ సినిమాలకు ఖతర్నాక్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ మధ్యే జయ జానకీ నాయకా సినిమాకు 710 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. ఇదే ఈ హీరోలో నమ్మకం కలిగిస్తుంది. మే 12న ఈ సినిమా విడుదల కానుంది.
గతంలో అల్లు అర్జున్‌కు ఇదే కలిసొచ్చింది. పుష్పకు ముందు బన్నీకి యూ ట్యూబ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా తనకు ఇదే రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు బెల్లంకొండ. మరి ఆయన నమ్మకాన్ని ఛత్రపతి నిలబెడుతుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.