Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandini Chowdary: రాజ్ తరుణ్‌తో అందుకే సినిమాలు చేయలేదు.. ఛాన్స్ వచ్చింది కానీ..

కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించిది ఈ బ్యూటీ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కాగా సుహాస్ తో కలిసి కలర్ ఫోటో అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Chandini Chowdary: రాజ్ తరుణ్‌తో అందుకే సినిమాలు చేయలేదు.. ఛాన్స్ వచ్చింది కానీ..
Raj Tarun, Chandini Chowdar
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2024 | 9:39 AM

Share

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. సినిమాల్లోకి రాక ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది చాందిని. కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించిది ఈ బ్యూటీ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కాగా సుహాస్ తో కలిసి కలర్ ఫోటో అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. రీసెంట్ గా గామి అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. అయితే చాందిని తోపాటు షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. చాందిని, రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించారు. అయితే సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరూ కలిసి కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఎందుకు రాజ్ తరుణ్ తో కలిసి నటించలేదు అన్న ప్రశ్నకు చాందిని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

రాజ్ తరుణ్ తో కలిసి నటించకపోవడానికే ప్రత్యేక కారణం అంటూ ఏది లేదు. రాజ్ తరుణ్ తో కలిసి నటించడానికి ఆఫర్స్ రాలేదు. కొన్ని సినిమాల్లో రాజ్ తరుణ్ కు జోడీగా ఛాన్స్ లు వచ్చాయి. కానీ అనుకొని కారణాల వల్ల ఆ సినిమాలు చేయలేదు. రాజ్ తరుణ్ నటించిన మొదటి మూడు సినిమాలు హీరోయిన్ గా నన్నే సంప్రదించారు. కానీ అనుకోకుండా అవి చేయడం కుదరలేదు. అంతకు మించి ఏ కారణం లేదు. ఇప్పటికి మేమిద్దరం టచ్ లోనే ఉంటాం.. అని చెప్పుకొచ్చారు చాందిని చౌదరి. ప్రస్తుతం చాందిని చౌదరి యేవమ్‌ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. అలాగే మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో