Kangana Ranaut: అత్యాచారం, హత్యలకు సపోర్ట్ చేస్తారా.? గూబగుయ్ మనిపించిన కంగనా.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసింది. ఇటీవల చంఢీఘడ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ మాత్రం లేడీ కానిస్టేబుల్ కు మద్దతు తెలిపారు. ఒకవేళ ఆమె ఉద్యోగం పోతే తాను ఆమెకు అండగా నిలబడతానని జాబ్ కూడా ఇస్తానని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసింది. ఇటీవల చంఢీఘడ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ మాత్రం లేడీ కానిస్టేబుల్ కు మద్దతు తెలిపారు. ఒకవేళ ఆమె ఉద్యోగం పోతే తాను ఆమెకు అండగా నిలబడతానని జాబ్ కూడా ఇస్తానని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలాగే మరికొందరు బీటౌన్ సెలబ్రెటీలు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి మద్దతుగా పోస్టులు పెట్టారు. దీంతో వారందరికీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది కంగనా రనౌత్. తనపై జరిగిన దాడికి సపోర్ట్ చేసిన వారిపై తన స్టైల్లో విరుచుకుపడింది.
“ప్రతి రేపిస్ట్, హంతకుడు లేదా దొంగ.. ఇలా ఎవరైనా నేరం చేయడానికి బలమైన భావోద్వేగ, శారీరక లేదా మానసిక, ఆర్థిక కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయితే నేరానికి పాల్పడినవారు దోషులుగా నిర్ధారణ జరిగి శిక్షను ఎదుర్కొంటారు. బలమైన భావోద్వేగ ప్రేరణతో నేరాలకు పాల్పడేవారితో మీరు జతకడితే దేశానికి సంబంధించిన ఎలాంటి చట్టాలనైనా మీరు అతిక్రమిస్తారు. అనుమతి లేకుండా ఇతరులను అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం.. అనుమతి లేకుండా వారి శరీరాలను తాకడం, దాడికి పాల్పడడం మీకు కరెక్ట్ అనిపిస్తే అత్యాచారం, హత్యలను మీరు సమర్ధిస్తున్నట్లే. మీ మానసిక నేరపూరిత ఆలోచనలను లోతుగా పరిశీలించుకోవాలి. దయచేసి యోగా, ధ్యానం చేయాలని సూచిస్తున్నాను. లేదంటే మీ జీవితం ఒక చేదు, భారంగా మారిపోతుంది. ఎక్కువగా పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. దయచేసి స్వేచ్ఛగా ఉండండి” అంటూ సుధీర్ఘ ట్వీట్ చేసింది. తన ట్వీట్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.