Pathaan: పఠాన్ సినిమాకు తప్పని రిపేర్లు.. ఆ సీన్స్ తొలగించాల్సిందేనన్న సెన్సార్ బోర్డు

|

Jan 18, 2023 | 4:25 PM

షారుక్ నటిస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Pathaan: పఠాన్ సినిమాకు తప్పని రిపేర్లు.. ఆ సీన్స్ తొలగించాల్సిందేనన్న సెన్సార్ బోర్డు
Pathaan
Follow us on

బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన పఠాన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించి చాలా ఏళ్లు అయ్యింది. షారుక్ నటిస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమా లోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అభ్యంతరకమైన సీన్లను తొలగించాలని సినిమా యూనిట్‌ను సెన్సార్‌ బోర్డు ఇప్పటికే ఆదేశించింది.

దీపికా పదుకొనే వేసుకున్న దుస్తులు, వీరి మధ్య పాటను చిత్రీకరించిన విధానం అభ్యంతరకరంగా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ చిత్రాన్ని బాయ్‌ కాట్‌ చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే భేషరమ్‌ రంగ్ సాంగ్ ను సినిమానుంచి తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెన్సార్ బోర్డు సినిమాలోని కొన్ని సీన్స్ ను కట్ చేసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్‌ 2గంటల 26 నిమిషాల 16 సెకన్లు. ఇక భేషరమ్‌ రంగ్ సాంగ్ పాటలో సెన్సార్‌ బోర్డు మూడు కట్స్‌ చెప్పిందట. దీపిక గోల్డెన్‌ స్విమ్‌ సూట్‌లో ఉన్న మూడు క్లోజప్‌ షాట్స్‌ తొలగించామన్నారట.. అలాగే ఆ పాటలో డ్యాన్స్‌ మూమెంట్స్‌లో మార్పులు చేయమన్నారట. ఇక మొత్తం సినిమాలో పది కట్స్ చెప్పారట సెన్సార్ బోర్డు. దాంతో ఇప్పుడు సినిమాను రీ షూట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఫిక్స్ అయ్యారు.