AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నటవిశ్వరూపానికి’ బర్త్ డే విషెస్

ఎన్టీఆర్..ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయమే ఉంది. ఆ లెగసీని మూడవ తరం వారసుడిగా ఏమాత్రం తగ్గకుండా బాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు చిన్న తారక రాముడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఎన్టీఆర్..తన కెరీర్‌లో పలు విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేయడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. డైలాగ్ చెప్పాలన్నా, డ్యాన్స్ వేయాలన్నా, పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలన్నా అందులో ఎన్టీఆర్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది. […]

'నటవిశ్వరూపానికి' బర్త్ డే విషెస్
Ram Naramaneni
|

Updated on: May 20, 2019 | 1:43 PM

Share

ఎన్టీఆర్..ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయమే ఉంది. ఆ లెగసీని మూడవ తరం వారసుడిగా ఏమాత్రం తగ్గకుండా బాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు చిన్న తారక రాముడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఎన్టీఆర్..తన కెరీర్‌లో పలు విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేయడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. డైలాగ్ చెప్పాలన్నా, డ్యాన్స్ వేయాలన్నా, పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలన్నా అందులో ఎన్టీఆర్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది. అందుకే తాతకు తగ్గ మనవడిగా దూసుకుపోతున్నాడు. నేడు ‘యంగ్ టైగర్’ 36వ పుట్టినరోజున జరుపుకుంటున్నాడు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం తారక్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నాడు. ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ గతేడాది జరిగిన రొడ్డూ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే వేడుకలకు దూరంగా ఉన్నట్టు సన్నిహితులు తెలిపారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు విషెస్ తెలిపారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్‌. జీవితంలో మరెన్నో విజయాలు అందుకోవాలి. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా- రామ్ చరణ్

హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌.. రాక్‌ ఆన్‌..– రానా దగ్గుబాటి

హ్యాపీ బర్త్‌డే తారక్‌.. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను- సాయి ధరమ్‌ తేజ్‌

రౌడీ హీరో తరుపున హ్యపీ బర్త్ డే తారక్ అన్న- విజయ్ దేవరకొండ

మాన్ ఆఫ్ ద మాసస్ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు- సురేష్ ప్రొడక్షన్స్

హ్యాపీ బర్త్‌డే తారక్‌ సర్‌- ప్రణీత

‘జైలవకుశ’కు జన్మదిన శుభాకాంక్షలు. తారక్‌తో నటించడం ఓ గొప్ప అనుభూతి- హంసా నందిని

మోస్ట్ పవర్‌పుల్ యాక్టర్ ఎన్టీఆర్‌కు బర్త్ డే విషస్- సంపత్ నంది

తెలుగు చిత్ర పరిశ్రమలోని అద్భుతమైన నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌కు హ్యాపీ బర్త్‌డే- వెన్నెల కిశోర్

నా డియరెస్ట్‌ ఫ్రెండ్‌ తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు- ఈషా రెబ్బా

హ్యాపీ బర్త్‌డే తారక్‌- అనిల్ రావిపూడి

ఆయనతో కలిసి పనిచేయడం దర్శకుల అదృష్టం. మున్ముందు మాకు ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండు తారక్‌- బాబీ(కేఎస్ రవీంద్ర)

నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నిజమైన స్నేహితుడు, అద్భుతమైన నటుడు- కోన వెంకట్

హ్యాపీ బర్త్‌డే తారక్‌. ఎల్లప్పుడూ ఇలాగే నీలో ఉన్న పాజిటివీని అందరికీ పంచుతూ ఉండు-  కాజల్ అగర్వాల్

తారక్‌లాంటి సోదరుడిని ఇచ్చినందుకు, నా వందో సినిమా (అరవింద సమేత..) అయినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. యంగ్‌ టైగర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు- తమన్

తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన తరంలో ఈయన విభిన్నమైన నటుడు- హరీశ్ శంకర్

పవర్‌ప్యాక్డ్‌, పవర్‌హౌజ్‌ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు- సీనియర్ నరేశ్ 

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌