Praneeth Hanumantu: ప్రణీత్ హనుమంతు పై మరోకేసు.. మెడికల్‌ రిపోర్ట్‌లో షాకింగ్ విషయం

|

Jul 19, 2024 | 10:54 AM

సోషల్ మీడియాలో తండ్రి, కూతుర్ల రిలేషన్ పై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు హనుమంతు. అతని పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హనుమంతు పై ఫైర్ అయ్యారు. పెద్దెత్తున విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు.  తాజాగా యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంత్‌పై మరో కేసు నమోదు అయ్యింది. 

Praneeth Hanumantu: ప్రణీత్ హనుమంతు పై మరోకేసు.. మెడికల్‌ రిపోర్ట్‌లో షాకింగ్ విషయం
Praneeth Hanumanthu
Follow us on

యుటీబల్ ప్రణీత్ హనుమంత్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తండ్రి, కూతురు బంధంపై  చీప్ కామెంట్స్ చేసి జైలుపాలు అయ్యారు ప్రణీత్. సోషల్ మీడియాలో తండ్రి, కూతుర్ల రిలేషన్ పై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు హనుమంతు. అతని పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హనుమంతు పై ఫైర్ అయ్యారు. పెద్దెత్తున విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు.  తాజాగా యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంత్‌పై మరో కేసు నమోదు అయ్యింది.

ప్రణీత్‌ గంజాయి సేవించినట్టు మెడికల్‌ రిపోర్ట్ రావడంతో అతడిపై NDPS కింద కేసు పెట్టారు పోలీసూలు. ప్రణీత్‌ను మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు‌. ఈ మేరకు ప్రణీత్‌ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది కోర్టు. తండ్రి, కూతుర్ల బంధంపై యూట్యూబ్‌లో దారుణమైన కామెంట్స్‌ చేసిన ప్రణీత్‌ హనుమంత్‌..ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు.

డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన హనుమంతు పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. హద్దు దాటానని.. క్షమాపణలుకోరుతూ ఓ వీడియోను కూడా వదిలాడు ఇతగాడు. గత  కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులను చాలామంది బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వారిని ఏమి అనొద్దని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పుకొచ్చాడు. తప్పు చేసి క్షమించమని అడిగినా అతని పై జనాలు మండిపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవారికి బుద్దొచ్చేలా శిక్షించాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయటకు రావడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.