Nayanthara: నయనతారకు మరో షాక్‌.. రాముడిని కించపరిచారంటూ లేడీ సూపర్‌ స్టార్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?

|

Jan 11, 2024 | 8:51 PM

నయనతారకు మరో షాక్ తగిలింది. శ్రీరాముడిని కించపరిచారంటూ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్, సినిమా నిర్మాతతో సహా ఏడుగురిపై హిందూ సేవా పరిషత్ సభ్యులు కేసు నమోదు చేశారు.

Nayanthara: నయనతారకు మరో షాక్‌.. రాముడిని కించపరిచారంటూ లేడీ సూపర్‌ స్టార్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?
Nayanthara
Follow us on

శ్రీరాముడిని అవమానించారంటూ ప్రముఖ నటి నయనతారపై కేసు నమోదైంది . నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రం ఇటీవల విడుదలైంది. సినిమాలో శ్రీరాముడిని కించపరిచారంటూ నయనతారతో పాటు ఆ సినిమాకు సంబంధించిన ఏడుగురిపై మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ముంబైలో కూడా ఈ సినిమాపై కేసు నమోదైంది. నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి. అదే సమయంలో అన్నపూర్ణి సినిమాపై వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ సినిమాలో శ్రీరాముడిని అవమానించారంటూ, హిందూ సమాజం మనోభావాలు, శ్రీరామ భక్తుల మనోభావాలు దెబ్బతీసే అంశాలున్నాయని కొందరు నయనతార మూవీపై దుమ్మెత్తిపోస్తున్నారు. అన్నపూర్ణి సినిమాలో రామాయణంపై అభ్యంతరకర డైలాగులు ఉన్నాయని ఫిర్యాదు దారులు చెబుతున్నారు. సినిమాలోని మరికొన్ని సన్నివేశాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బ్రాహ్మణ యువతి మాంసాహార వంటకాలు చేసి నమాజ్ చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార సినిమా ‘లవ్ జిహాద్’ని ప్రేరేపిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణి సినిమాపై శివసేన మాజీ నేత రమేష్ సోలంకి కొద్ది రోజుల క్రితం ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటి నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్, సినిమా నిర్మాతతో సహా ఏడుగురిపై హిందూ సేవా పరిషత్ ఫిర్యాదు దాఖలు చేశారు. ‘అన్నపూర్ణి’ సినిమాపై వివాదం చెలరేగడంతో నెట్‌ఫ్లిక్స్ తన OTT ప్లాట్‌ఫామ్ నుండి సినిమాని తొలగించింది. హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు జీ స్టూడియో క్షమాపణలు చెప్పింది. హిందువులు, బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయలేదని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా నయనతారపై కేసు నమోదైంది. మరి దీనిపై లేడీ సూపర్‌ స్టార్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మాణ కుటుంబంలో జన్మించిన అమ్మాయికి చెఫ్ కావాలనే కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి మంచి చెఫ్ కావాలని అనుకుంటుంది. కానీ బ్రహ్మాణ అమ్మాయి చెఫ్ కావడం.. మాంసాన్ని ముట్టుకోవడం.. వండడం అనేది పెద్ద సవాళ్లు. ఈ క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులను అన్నపూరణి ఎలా ఎదుర్కొంది ? చివరకు తన కలను ఎలా సాధ్యం చేసుకుంది అనేది ? ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.