చేసినవి 10 సినిమాలు.. అందులో 6 డిజాస్టర్లు.. అయినా ఈ అమ్మడి క్రేజ్ తగ్గేదేలే.. ఎవరంటే.?

ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? చిన్నారి తెలుగు సినిమాతో మాంచి ఫేమ్ సాధించింది. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్. బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు మూడు తమిళ చిత్రాల్లో నటించింది ఈ అందాల బ్యూటీ.

చేసినవి 10 సినిమాలు.. అందులో 6 డిజాస్టర్లు.. అయినా ఈ అమ్మడి క్రేజ్ తగ్గేదేలే.. ఎవరంటే.?
Actress

Updated on: Feb 21, 2025 | 5:40 PM

పైన ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? మీరు ఎక్కువగా సినిమాలు చూస్తున్నట్లయితే.. ఈజీగా చెప్పేస్తారు. బాలీవుడ్ హీరో చిత్రంతో సైడ్ యాక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తెలుగులో చేసిన మొదటి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ కొట్టింది ఈ భామ. ఆ సినిమాకు దాదాపుగా వంద కోట్ల కలెక్షన్లు రావడమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డులు కూడా వచ్చాయి. దానితో ఈ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. నాని, నాగచైతన్య, సుదీర్ బాబు లాంటి యంగ్ హీరోల సరసన నటించింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లకు రాకుమారిగా మారిపోయింది. అయితే ఈ మధ్య ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అయినా అమ్మడి క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే మరో 3 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈపాటికి ఆమె ఎవరో గుర్తుపట్టేసి ఉంటారు. మరెవరో కాదు మన బేబమ్మ కృతి శెట్టి.

ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో

ఇవి కూడా చదవండి

హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపిస్తుంది అమ్మడు. ఆ తర్వాత తెలుగులో వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఉప్పెన’తో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ, నాగచైతన్యతో బంగర్రాజు, కస్టడీ సినిమాల్లో.. అలాగే రామ్ పోతినేనితో ది వారియర్‌, సుధీర్‌ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాల్లో నటించింది కృతి శెట్టి. అయితే ఈ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇక గతేడాది శర్వానంద్‌తో మనమే, మలయాళంలో ఆర్మ్ అనే చిత్రాలు చేసినా కృతి శెట్టికి అదృష్టం తెచ్చిపెట్టలేదు. అయితేనేం తాజాగా కృతి శెట్టి ఖాతాలో మూడు సినిమాలు ఉన్నాయి. తమిళంలోనే ఈ మూడు చిత్రాలు చేస్తోంది అందాల భామ. ‘వా వాథియర్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘జీని’ చిత్రాలు. వీటితోనైనా కృతి మళ్లీ సక్సెస్ బాట పట్టాలని ఆశిద్దాం.

ఇది చదవండి: భారత్‌లో ‘టెస్లా’ కార్లు ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే

ఇది చదవండి: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి