Tollywood: బాబోయ్.. ఈ హీరోయిన్ మల్టీటాలెంటెడ్.. డాక్టర్ కమ్ సింగర్.. ఆ స్టార్ డైరెక్టర్ కూతురు..

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొద్దిరోజులుగా పలువురు హీరోయిన్స్ కెరీర్ కు సంబంధించిన విషయాలు, ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి పిక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Tollywood: బాబోయ్.. ఈ హీరోయిన్ మల్టీటాలెంటెడ్.. డాక్టర్ కమ్ సింగర్.. ఆ స్టార్ డైరెక్టర్ కూతురు..
Aditi
Follow us

|

Updated on: Oct 26, 2024 | 11:05 AM

సినీరంగంలో ఆ అమ్మాయి తండ్రి స్టార్ డైరెక్టర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాదిలో అతడి చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఆయన కూతరు కూడా సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగుతుంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఆ బ్యూటీ.. కథానాయికగానే కాదు.. సింగర్ కూడా. పైన ఫోటోను చూశారా ?.. అందులో డాక్టర్‏గా కూర్చిలో కూర్చున్న అమ్మాయి సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అయితే ఆ ఫోటో సినిమా షూటింగ్ కోసం కాదు.. ఆమె నిజంగానే డాక్టర్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్.

అదితి శంకర్ ఇప్పుడు సౌత్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 1993 జూన్ 19న చెన్నైలో జన్మించిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. కోలీవుడ్ హీరో కార్తి సరసన విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. కొన్నాళ్ల తర్వాత శివకార్తికేయన్ తో కలిసి మావీరన్ చిత్రంలో కనిపించింది అదితి. కేవలం నటిగానే కాకుండా మావీరన్ సినిమాతో సింగర్‏గానూ నిరూపించుకుంది.

నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పలు ఆసుపత్రిలలో డాక్టర్ గా సేవలు చేసింది. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో అదితి తన ఎంబీబీఎంస్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.