Tollywood: అరె ఏంట్రా ఇది. ఈ హీరోయిన్‏కు ఏమైందీ.. ? సమంతకు ట్విన్ సిస్టర్‏లా ఉండేది.. ఇప్పుడు ఇలా..

ప్రస్తుతం సినీరంగంలో యంగ్ హీరోయిన్స్ చాలా మంది వరుస సినిమాలతో రాణిస్తున్నారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీకి దూరమైపోయారు. ఇప్పుడు ఓ హీరోయిన్ చాలా గ్యాప్ తర్వాత అభిమానుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా బక్కిచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Tollywood: అరె ఏంట్రా ఇది. ఈ హీరోయిన్‏కు ఏమైందీ.. ? సమంతకు ట్విన్ సిస్టర్‏లా ఉండేది.. ఇప్పుడు ఇలా..
Pavitra Lakshmi

Updated on: Jul 15, 2025 | 5:32 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. అయితే వరుస సినిమాలతో అలరిస్తుందనుకున్న ఈ అమ్మడు.. ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తిరిగి అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఒకప్పుడు బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పూర్తిగా బరువు తగ్గిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఈ హీరోయిన్ కు ఏమైందీ ? అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ పవిత్ర లక్ష్మి. తమిళంలో కుక్ విత్ కోమలి అనే షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఆ తర్వాత మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే సినిమాల్లో సెకండ్ హీరోయిన్, కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న పవిత్ర లక్ష్మి.. నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే సినిమాల్లోకి తిరిగి వస్తుందని భావించిన పవిత్ర.. ఇప్పుడు పూర్తిగా బక్కిచిక్కిపోయి కనిపించింది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆమె న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Telugu Cinema: 16 ఏళ్లకే హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్..

ఇదిలా ఉంటే.. పవిత్ర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని రూమర్స్ వ్యాపించాయి. కొన్ని రోజుల క్రితం పవిత్ర లక్ష్మి తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది. తాను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దానికి చికిత్స పొందుతున్నానని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశారు. తన గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరింది. తనకు కూడా ఒక జీవితం ఉందని ఎవరూ మర్చిపోకూడదని చెప్పింది. తాజాగా పవిత్ర లక్ష్మి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Pavitra Lakshmi New

 

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..