
సాధారణంగా సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో బాలనటీనటులుగా కనిపించి.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు సైతం ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. వెంకటేశ్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకు కూతురిగా కనిపించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఆఫర్స్ కోసం వెయిట్ చేసింది. కానీ అంతగా సక్సెస్ మాత్రం కాలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లో మాస్టర్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఫారిన్ వీధుల్లో గ్లామర్ లుక్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ బ్యుటీ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు బాలనటిగా.. అమాయకమైన నటనతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ ఫోజులతో నెట్టింట హీటెక్కిస్తోందంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే ఎస్తేర్ అనిల్.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఎస్తేర్ అనిల్.. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్. అలాగే తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాలో కనిపించింది. వెంకటేశ్, మీనా కలిసి నటించిన దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురిగా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మడు లండన్ లో మాస్టర్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం అక్కడ ఓ రెస్టారెంట్ లో ఆమె పనిచేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. లండన్ లో మాస్టర్స్ చేస్తున్న సమయంలో తనను తాను పోషించుకోవడానికి కొంతకాలం రెస్టారెంట్‌లో పనిచేశానని తెలిపింది. ఆ సమయంలో తాను ఎంతో కష్టపడ్డానని.. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఎస్తేర్ మూడో తరగతిలో ఉండగానే.. మోహన్ లాల్ తో కలిసి నటించిన ‘ఒరు నాల్ వరుమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా ఆమెను అందరి దృష్టిని ఆకర్షించింది. ‘దృశ్యం’ మూడు భాషా వెర్షన్లలో నటించి తనకు పాన్-ఇండియన్ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..