
ఒకప్పుడు సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఆతర్వాత కథానాయికగా మారింది. వరుస సినిమాలతో అద్భుతమైన నటనతో సినీప్రియులను కట్టిపడేసింది. దాదాపు 40 ఏళ్లుగా నటిగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ? ఒకప్పుడు అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తెలుగులో సహాయ పాత్రలు పోషిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పటికీ హీరోయిన్ పాత్రలతో వెండితెరపై సందడి చేస్తుంది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మీనా. దక్షిణాదిలో ఆమె అగ్రకథానాయిక.
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. మద్రాసులో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. బాలనటిగా అనేక చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులోనే కథానాయికగా మారింది. ప్రస్తుతం వయసుకు తగినట్లుగా సహాయ పాత్రలు పోషిస్తుంది. 1991 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్.. పదేళ్లపాటు ఇండస్ట్రీని ఏలేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనికా అనే అమ్మాయి జన్మించింది.
కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వెంకీ జోడిగా దృశ్యం 1, 2 చిత్రాల్లో నటించింది. మీనా భర్త 2022 జూన్ లో చెన్నైలో అనారోగ్య సమస్యలతో మరణించారు. కొన్నాళ్లుగా మీనా పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు వైరలవుతున్నాయి. తన రెండో పెళ్లి గురించి చక్కర్లు కొడుతున్న రూమర్స్ ను ఖండించింది మీనా.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..