
సాధారణంగా సినీరంగంలోని స్టార్స్ త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఓ అమ్మాయి పిక్ నెట్టింట తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో గుర్రంపై స్వారీ చేస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్. కానీ ఆమెకు సినీరంగంలో అంతగా బ్రేక్ రాలేదు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ బ్యూటీకి నెట్టింట విపరీతమై ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఇషా డియోల్. ఈ ముద్దుగుమ్మ స్వయంగా తన చిన్ననాటి ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.
“ఈ ఫోటో 1987 నాటిది. ఊటీలో మా చిత్రీకరణ సమయంలో తీసిన ఫోటో ఇది. శాంతి అనే పేరుగల అందమైన గుర్రం ఉండేది. రాము అనే వ్యక్తి దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. చిన్నప్పుడు ఉదయం , సాయంత్రం గుర్రపు స్వారీ చేయడం అంటే చాలా ఇష్టం. నగరాలు, పర్వతాలు, మార్కెట్స్ ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగేవాళ్లం. నాకు జంతువులను ప్రేమించడం.. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం.. ఆహారం అందించడం రాము నేర్పించాడు. ఇప్పటికీ ఆ క్షణాలను మిస్ అవుతున్నాను” అంటూ రాసుకొచ్చింది.
ఇషా డియల్.. ధూమ్ సినిమాతో ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంది. ఆమె తల్లిదండ్రులు బాలీవుడ్ సూపర్ స్టార్స్ ధరేంద్ర, నటి హేమ మాలిని. వీరిద్దరూ ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పినవారే. 2002లో ‘కోయి మేరే దిల్ సే పూచ్’ చిత్రంతో ఇషా సినీరంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..